ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 5వ తేదీన.. అంటే ఈ రోజు భారీ జాబ్ మేళాను (Mega Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొననన్నాయి. ఈ కంపెనీల్లో మొత్తం 1500 ఉద్యోగాల (Jobs) భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్. అమర రాజా బ్యాటరీస్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్, ఫ్లిప్ కార్ట్, మెడికవర్ హాస్పిటల్స్ తదితర ప్రముఖ సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. అయితే అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలకు హాజరుకావొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు ఏపీ, తెలంగాణలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. వారు ఎంపికైన ఉద్యోగం, కంపెనీ ఆధారంగా వారు పని చేసే ప్రదేశం, వేతనం ఆధారపడి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
Delhi University: ఢిల్లీ యూనివర్సిటీ ఇంటర్న్షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. అర్హత, అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు..
@AP_Skill has Conducting Job Mela at Government Polytechnic College #Atmakur @nelloregoap Registration Link https://t.co/lsKBTzQhX1 pic.twitter.com/Q3HWmUYgC3
— AP Skill Development (@AP_Skill) November 4, 2022
ఇతర పూర్తి వివరాలు:
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
-ఇంటర్వ్యూలను ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, నెల్లూరు రోడ్, ఆత్మకూరు చిరునామాలో నిర్వహించనున్నారు.
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 5న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
-ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume కాపీలతో పాటు డాక్యుమెంట్లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
-ఇతర పూర్తి సమాచారం కోసం 9491284199, 8639893675, 8142881801 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, JOBS, Private Jobs