Home /News /jobs /

MEGA JOB MELA IN AP FOR JOB VACANCIES AT AUROBINDO PHARMA HERE REGISTRATION LINK NS

AP Jobs: ఏపీలో ఈ నెల 11న మరో భారీ జాబ్ మేళా.. అరబిందో ఫార్మాలో 475 జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో మరో భారీ జాబ్ మేళా(Job Mela)ను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పోరేషన్ (APSSDC) నిరుద్యోగాలకు మరో శుభవార్త చెప్పింది. ఇటీవల వరుసగా జాబ్ మేళాలను (Job Mela) నిర్వహిస్తున్న సంస్థ తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ AUROBINDO PHARMA కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. మొత్తం 475 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    1.Department QC, Production, Packing, Maintenance విభాగంలో ఈ 475 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంఎస్సీ/బీఎస్సీ/ఎంఫార్మసీ/బీఫార్మసీ/డిప్లొమా స్టూడెండ్స్/ఇంటర్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 2018-22 వరకు పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వేతనం ఉంటుంది.
    Jobs in AP: ఏపీలో డిగ్రీ/డిప్లొమా చేసిన వారికి 200 జాబ్స్.. ఈ లింక్ తో రిజిస్ట్రేషన్ చేసుకోండి



    ఇతర వివరాలు:
    - అభ్యర్థులు ముందుగా https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 11న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
    - టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
    - ఎంపికైన అభ్యర్థులు ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాలో పని చేయాల్సి ఉంటుంది.
    - అభ్యర్థులు ఇతర వివరాలకు 8639015530, 6301006979 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job Mela, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు