ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 23న భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విజయనగరంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 15 ప్రముఖ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం ఉంటుంది. సంస్థలు, ఎంపికైన ఉద్యోగం ఆధారంగా వేతనం ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ జాబ్ మేళా ద్వారా డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెటెరో, జయభేరీ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ బయోకెమికల్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్ ప్లస్, రాన్ స్టాన్డ్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్, అపోలో ఫార్మసీ, డిక్సన్ టెక్నాలజీ, రిలయన్స్ ట్రెండ్స్ తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ సంస్థల్లో వేయికి పైగా ఉద్యోగాల భర్తీకి ఈ నెల 23న ఇంటర్వ్యూలను రేపు నిర్వహించనున్నారు.
Job Tips: ఎంత ట్రై చేసిన జాబ్ రావట్లేదా? అయితే.. ఈ 6 టిప్స్ పాటిస్తే జాబ్ పక్కా.. ఓ లుక్కేయండి
@AP_Skill - @SEEDAP_AP - Employment Office has Jointly Conducting Job Mela at TTDC Mahila Pranganam @vzmgoap Registration Link: https://t.co/ms1H56KyNK pic.twitter.com/5Yj9r9Cd7J
— AP Skill Development (@AP_Skill) September 16, 2022
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 23న మహిళ ప్రాంగణం, V.T.Agraharam చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 6301574739, 809946130 నంబర్లను సంప్రదించాలన ిప్రకటనలో సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, JOBS, Private Jobs, Vizianagaram