Home /News /jobs /

MEGA JOB MELA IN ANDHRA PRADESH VIJAYAWADA FOR TENTH INTER DEGREE BTECH PG CANDIDATES HERE REGISTRATION LINK NS

Mega Job Mela in AP: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. రేపు భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. రేపు అంటే ఈ నెల 2న భారీ జాబ్ మేళా (Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విజయవాడలో ఈ భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. రేపు అంటే ఈ నెల 2న భారీ జాబ్ మేళా (Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విజయవాడలో ఈ భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ Big C Mobiles, Dmart, LEO Global Overseas Educational Consultancy, Randstand India Private Limited తదితర సంస్థలో పాల్గొని నియామకాలు చేపట్టనున్నాయి. ఈ జాబ్ మేళాలో పాల్గొనాలనుకుంటున్న వారు ముందుగా రిజిస్ట్రేషన్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    Big C Mobiles: ఈ సంస్థలో 35 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ చేసిన వారు ఈ ఖాళీలకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 28 ఏళ్లలోపు ఉండాలి.
    DMart: ఈ సంస్థలో 120 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    Jobs in AP: ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి Flipkartలో జాబ్స్.. రూ.40 వేల వేతనం.. స్పాట్ లో ఆఫర్ లెటర్

    LEO Consultancy: ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    Randstad India Private Ltd: ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీటెక్, పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు
    Wheels Mart: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.9500 నుంచి రూ.15 వేల వరకు వేతనం చెల్లిస్తారు.



    ఇతర వివరాలు:
    - అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు Career Walk, Opp.Congress Party Office, Governorpeta, Vijayawada, NTR District చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
    - ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    - ఏమైనా సందేహాలుంటే 7981927092, 8688842879 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, JOBS, Private Jobs

    తదుపరి వార్తలు