ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నుంచి ఇటీవల వరుసగా జబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించిన ప్రకనటనను APSSDC విడుదల చేసింది. Varun Motors Ltd, meesho, Qess Corp Limited, D Mart తదితర ప్రముఖ సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ నెల 27న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు APSSDC తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీన నిర్వహించనున్న ఇటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అర్మత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Varun Motors: మల్టిపుల్ రోల్స్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా(మెకానికల్&ఆటోమొబైల్), బీటెక్(మెకానికల్), ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 8500 నుంచి రూ. 12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఇంకా ఇన్సెంటీవ్స్, పెట్రోల్ అలవెన్స్ రూ.1500-రూ.2 వేల వరకు చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 29 ఏళ్లు ఉండాలి.
Meesho: ఈ సంస్థలో సేల్స్ అసోసియేట్స్/ఆఫీసర్స్ విభాగంలో ఖాళీల భర్తీని చేపట్టారు. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 22 వేలతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయని ప్రకటనలో తెలిపారు.
Bank Jobs 2021: నిరుద్యోగులకు అలర్ట్.. యూనియన్ బ్యాంక్ లో జాబ్స్.. ఇలా అప్లై చేయండి
Dmart: ఈ సంస్థలో క్యాషియర్, సేల్స్ అసోసియేట్, గోడౌన్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో నియామకాలు చేపట్టారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10,900 నుంచి రూ.11,500 వరకు వేతనం చెల్లిచనుననారు. దీంతో పాటు మంచి ఇన్సెంటీవ్స్ ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు విజయవాడ, గుంటూరు, ఒంగోలులో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 18 నుంచి 30 ఉండాలి.
Quess Corp Limited: ఇంటర్, డిగ్రీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
ఇతర వివరాలు:
1. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
2. అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
3. అభ్యర్థులు ఇతర వివరాలకు 9014943757, 9988853335 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
@AP_Skill has Conducting Skill Connect Drive at MRR College of Pharmacy #Nadigama #CRDARegion
Registration Link: https://t.co/MHLubyk11n@Meesho_Official @Quess_Corp@varunmotors #DMart pic.twitter.com/zEXGjkERpw
— AP Skill Development (@AP_Skill) December 24, 2021
ఇంటర్వ్యూ వేధిక: MRR College Of Pharmacy, Nandigama to Madhira Road, Nandigama, CRDA Region చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపు (డిసెంబర్ 27వ తేదీ) ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Crda, Job Mela, Private Jobs