Home /News /jobs /

MEGA JOB FAIR WILL BE ORGANIZED UNDER THE AUSPICES OF TELANGANA POLICE TOMORROW KNOW FULL DETAILS HERE VB

Mega Job Mela In Hyderabad: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు మెగా జాబ్ మేళా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mega Job Mela In Hyderabad: హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో రేపు(జూన్ 29) మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ పోలీసులు(Telangana Police) ఫ్రెండ్లీ పోలీసింగ్(Friendly Policing) పేరుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల భద్రతతో(Security) పాటు.. పలు సేవా కార్యక్రమాలతో ఎన్నో అవార్డులను(Awards) గెలుచుకున్నారు. ప్రతీ కార్యక్రమాల్లో ముందుండే తెలంగాణ పోలీసులు(Telangana Police) నిరుద్యోగులకు(Un Employees) ఉపాధి(Job) కల్పనకు కూడా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. గతంలో ఎన్నో సార్లు హైదరాబాద్ లో నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళాలను నిర్వహించారు. తాజాగా మరో సారి పోలీసుల ఆధ్వర్యంలో జూన్ 29న హైదరాబాద్ లో మెగా జాబ్ మేళాకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముషీరాబాద్ కవాడిగూడలోని కేర్ ఆసుపత్రి(Care Hospital) పక్కన ఉన్న హెరిటేజ్ ప్యాలెస్(Heritage Palace) లో ఈ మేళా నిర్వహించడం జరుగుతందని.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడ హాజరు కావాలని పేర్కొన్నారు.

TS EAMCET 2022 Preparation Tips: ఎంసెట్ లో మంచి స్కోర్ సాధించడం ఎలా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..


ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 15 ప్రముఖ కంపెనీల్లో 1500 ఉద్యోగాలను కల్పించనున్నాయి. జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీల వివరాల్లోకి వెళ్తే.. Apollo Pharmacies Ltd , TMI Group, Big Basket, Vijaya Diagnostic Center, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్ టెల్ మరియు ఇత కంపెనీలు ఉన్నాయి. ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు అభ్యర్థులు bit.ly/jcepassను ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇలా రిజిస్ట్రేషన్ లో జాబ్ అప్లికేషన్ ఫామ్ లో పేరు, విద్యార్హత , వయస్సు, ఫోన్ నంబర్ , ఈ మెయిల్, చిరునామా వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు రేపు జరిగే ఇంటర్వ్యూకు ఉదయం 9 గంటల లోపు హాజరవ్వాలని పోలీసులు పేర్కొన్నారు. పదో తరగతి నుంచి పీజీ చేసిన వారికి కూడా ఈ ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు.

myAvtar Job Fair: మహిళల కోసం ‘మై అవతార్(myAvtar)’ జాబ్ ఫెయిర్.. దరఖాస్తు, పూర్తి వివరాలిలా..


అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ నెల 29న జరగనున్న జాబ్ మేళాకు రావాలని పోలీసులు సూచించారు. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులు హాజరయ్యేందుకు హైదరాబాద్ లోని ఆయా పోలీస్ స్టేషన్ లో పోలీసులు భారీగా ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఈ మేళాలో పాల్గొనే విద్యార్థులు వెబ్ సైట్లో పేరు నమోదు చేసుకోవాలని చెప్పడంతో.. దానికి అనూహ్య స్పందన వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారని.. ఈ మేళాలో కూడా నిరుద్యోగులు పాల్గొని ఉద్యోగాలు పొందాలని పోలీసులు ఆకాంక్షించారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Jobs in telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు