Mega Job Mela: ఏపీలో మెగా జాబ్ మేళా.. 15 కంపెనీల్లో 2 వేల ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

APSSDC Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి భారీ జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. దాదాపు 15 కంపెనీల్లో దాదాపు 2 వేల ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో సారి భారీ ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ నెల 23న మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. దాదాపు 15 కంపెనీల్లో రెండు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23న ఉదయం 9 గంటలకు శ్రీ సాయి డిగ్రీ కాలేజీ, వినుకొండ, గుంటూరు జిల్లా చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    -Amaraja కంపెనీలో 800 ఖాళీలను ఈ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. మిషన్ ఆపరటేర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనం అందించనున్నారు. అయితే కేవలం పురుషులు మాత్రమే అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.
    -Apollo Pharmacyలో 100 ఖాళీలను భర్తీ చేయున్నారు. ఎంఫార్మసీ/బీఫార్మసీ/డీఫార్మసీ/టెన్త్/ఇంటర్/డిగ్రీతో పాటు పీసీఐ సర్టిఫికేట్ కలిగి రిటైల్ మెడికల్ అనుభవం కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 18 వేల వరకు వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.
    -Airtel Payments Bank(Kutumb Care) లో ఇంటర్ అర్హతతో ప్రమోటర్ విభాగంలో 63 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 13 వేల పాటు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.

    -SBI Cards&Loans(Quess Corp)లో 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్స్/BRE విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. విద్యార్హత వివరాలను నోటిఫికేషన్లో పేర్కొనలేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.
    -Hetero Drugsలో 150 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఐటీఐ/ఏదైనా డిగ్రీ/ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ) విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    -Metroలో క్యాషియర్స్/సేల్స్ అసోసియేట్స్/CRm/లాజిస్టిక్స్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 350 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.

    -Hero Moto Corpలో ఆపరేటర్ విభాగంలో 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,631 వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి.
    -RSMIPLలో ఆపరేటర్స్ విభాగంలో 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన ఈ ఉద్యోగాలకు నెలకు రూ.10631 వరకు వేతనాలు చెల్లించనున్నారు.
    -Flex India Pvt Ltdలో ఆపరేటర్స్ విభాగంలో 80 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 11 వేల వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు.
    PVR Cinimasలో 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10,800 వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి.


    -Navatha Road Transportలో DEO/Helpers విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
    LOMMA IT Solutions pvt ltdలో XML డవలపర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ సబ్జెక్టులో డిగ్రీతో పాటు బీటెక్/బీఎస్సీ/ఎంసీఏ/ఎమ్మెస్సీ/ఎంటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.8500 నుంచి రూ.9500 వరకు వేతనం చెల్లించనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి.
    Innov Source(Bob Products/Phonepe)లో 14 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి.

    -అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా www.apssdc.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర ఏమైనా సందేహాలుంటే 9160200652, 9885958060 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published: