హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Journey: ఇది కదా సక్సెస్ అంటే.. అమెరికాలో పట్టు వదలని విక్రమార్కుడు..!

Job Journey: ఇది కదా సక్సెస్ అంటే.. అమెరికాలో పట్టు వదలని విక్రమార్కుడు..!

Vatsal Nahata

Vatsal Nahata

Job Journey: ఉక్కులాంటి సంకల్పం, కష్టపడేతత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఆ విషయాన్ని మరోసారి నిరూపించాడు ఇండియన్ స్టూడెంట్. అతడి సక్సెస్ స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఉక్కులాంటి సంకల్పం, కష్టపడేతత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఆ విషయాన్ని ఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌ (SRCC) గ్రాడ్యుయేట్ అయిన వత్సల్ నహతా (Vatsal Nahata) మరోసారి నిరూపించాడు. 2020 కాలంలో ఒకవైపు కరోనా (Covid-19), మరోవైపు ఇమ్మిగ్రేషన్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యతిరేక వైఖరి కారణంగా విదేశీయులకు కొత్త ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో యూఎస్ పౌరులను మాత్రమే అమెరికాలోని కంపెనీలు హైర్ చేసుకున్నాయి. వత్సల్ అదే ఏడాదిలో యూఎస్ యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దక్కలేదు.

చివరికి వరల్డ్ బ్యాంకులో ఉద్యోగంతో విజయం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తన జర్నీ గురించి జాబ్ పోర్టల్ లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన సక్సెస్ స్టోరీ ఇప్పుడు వైరల్‌గా మారింది. అతని విజయగాథ ఎలా కొనసాగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఢిల్లీలోని SRCCకి చెందిన 23 ఏళ్ల వత్సల్ నహతా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యేల్ యూనివర్సిటీలో చేరాడు. 2020, ఏప్రిల్ నెలలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే రెండు నెలలకు ముందుగా కరోనా విజృంభణ, ఆర్థిక మాంద్యం ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ వ్యతిరేక వైఖరి వల్ల కంపెనీలు తమ ఉద్యోగులను భారీగా తొలగించాయి. దీంతో విదేశీయులకు కొత్తగా జాబ్‌లు దొరకడం అసాధ్యంగా మారింది. ఈ సంక్షోభం వత్సల్‌కు నిద్రలేని రాత్రులను మిగల్చింది. అప్పుడే వత్సల్ స్పూర్తిదాయకమైన జర్నీ ప్రారంభమైంది.

2 నెలల్లో గ్రాడ్యుయేషన్ పూర్తవుతున్న వేళ చేతిలో ఎలాంటి జాబ్ ఆఫర్ లేకపోవడంతో వత్సల్ చాలా నిరాశపడ్డాడు. యూఎస్‌లో ఉద్యోగం సంపాదించలేనప్పుడు యేల్‌కి రావడమేందుకు? అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. జాబ్ కోసం తిరిగి భారతదేశానికి రాకూడదని, తన ఫస్ట్ పేచెక్కు డాలర్లలోనే ఉండాలని బలంగా నిశ్చయించుకున్నాడు.

అలా రెండు నెలల్లో 1500కి పైగా కనెక్షన్ రిక్వెస్ట్‌లను సెండ్ చేశాడు. ఏకంగా 600 కోల్డ్ ఈ-మెయిల్స్‌ను పంపించాడు. ఈ క్రమంలో అతనికి 80 కాల్స్‌ వచ్చాయి. అయితే అత్యధిక సంఖ్యలో కంపెనీలు అతడిని రిజెక్ట్ చేశాయి. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వత్సల్ రిజక్షన్ల గురించి పట్టించుకోకుండా మనోధైర్యంతో తన ప్రయత్నాలను కొనసాగించారు.

ఇది కూడా చదవండి : వావ్.. మహిళ ఐడియా అదిరింది.. ఉద్యోగం కోసం కేక్‌పై రెజ్యూమ్‌!

ఈ సమయంలో 'ది జెంటిల్ హమ్ ఆఫ్ యాంగ్జయిటీ' పాట అతనికి ఎంతగానో హెల్ప్ అయింది. అంతిమంగా, వత్సల్ కృషి, వ్యూహం ఫలించాయి. మే మొదటి వారం నాటికి 4 ఉద్యోగ ఆఫర్లను దక్కించుకోగలిగాడు. వీటిలో వరల్డ్ బ్యాంక్ (World Bank)లోని ఎడ్యుకేషన్ గ్లోబల్ ప్రాక్టీస్‌లో కన్సల్టెంట్ జాబ్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈ జాబ్‌ తన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)తోపాటు వీసాను స్పాన్సర్ చేస్తాననే ఆఫర్ ఇచ్చింది.

బ్యాంక్ మేనేజర్ వరల్డ్ బ్యాంక్‌లోని ప్రస్తుత డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్‌తో కలిసి మెషిన్ లెర్నింగ్ పేపర్‌పై కో-అథార్‌షిప్ కూడా ఆఫర్ చేశారు. ఇప్పుడు వత్సల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)లో పని చేస్తున్నాడు. ఈ రెండు నెలల జర్నీలో నెట్‌వర్కింగ్ పెంచుకోవడం, సడలని సంకల్పంతో ముందుకు సాగడం, అవకాశాల కోసం వీలైనన్ని తలుపులు తట్టడమనే ముఖ్యమైన జీవిత పాఠాలు నేర్చుకున్నట్లు వత్సల్ పేర్కొన్నాడు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, JOBS, Success story, VIRAL NEWS

ఉత్తమ కథలు