ఇటీవల ప్రకటించిన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ 2022 ఫలితాల్లో (NEET 2022 Results) ఆలిండియా సెకండ్ ర్యాంక్‌తో సత్తా చాటాడు ఢిల్లీ స్టూడెంట్. కష్టపడి చదివి తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టాడు వత్స ఆశిష్ బత్రా (Vatsa Ashish Batra) అనే విద్యార్థి. ఇతడి తల్లిదండ్రులు మోనిక బత్రా, ఆశిశ్ బత్రా ఇద్దరూ సివిల్ సర్వెంట్స్ కావడం విశేషం. వత్స సాధించిన ఈ ర్యాంకు చూసి గర్విస్తున్నామని వీరు చెబుతున్నారు. తన ప్రిపరేషన్, సక్సెస్ స్టోరీ గురించి వత్స చెప్పిన విషయాలు తెలుసుకుందాం.దేశంలోనే బిగ్గెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన నీట్ 2022లో 720 మార్కులకుగాను 715 మార్కులు సాధించాడు 17 ఏళ్ల వత్స. ఈ ఏడాది మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌లో హయ్యెస్ట్ మార్కులు సాధించిన అభ్యర్థిగా ఇతడు రికార్డు సృష్టించాడు. రెండున్నరేళ్ల నుంచి ఈ పరీక్ష కోసం వత్స సన్నద్ధమవుతున్నాడు. పదకొండో తరగతిలో తాను అంతగా ప్రిపరేషన్‌కు టైమ్ కేటాయించలేదని, 12వ తరగతిలోనే ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం వెచ్చించానని చెప్పుకొచ్చాడు.
* ప్రిపరేషన్ స్ట్రాటజీ
ప్రతిరోజు 6 నుంచి 7 గంటల పాటు సొంతంగా నీట్ కోసం ప్రిపేర్ అయినట్లు వత్స తెలిపాడు. ఆకాశ్ బైజుస్ స్టూడెంట్ అయిన ఈ టాలెంటెడ్ స్టూడెంట్, ప్రాక్టీస్ కోసం ఎన్నో మాక్ టెస్ట్‌లు రాసినట్లు చెప్పాడు. వారంలో 4 నుంచి 5 సార్లు మాక్ టెస్టులు రాసినట్లు వివరించాడు. నీట్ (NEET) ఎంట్రన్స్ టెస్ట్ అటెండ్ చేయడానికి నెల ముందు నుంచి 20, 30 మాక్ టెస్టులు రాశాడు.
ఎన్సీఈఆర్టీ (NCERT) సిలబస్ కంటే కూడా టీచర్లు ఇచ్చిన నోట్స్ పైన బాగా శ్రద్ధ వహించినట్లు వత్స స్పష్టం చేశాడు. సబ్జెక్ట్స్‌పైన పూర్తి అవగాహన ఏర్పడటానికి సెల్ఫ్‌గా ప్రిపేర్ కావడం అతి ముఖ్యమని సూచించాడు. ఈ విద్యార్థి ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం టాప్ మెడికల్ కాలేజీలో సీటు కోసం ఎదురుచూస్తున్నాడు.
* ఎగ్జామ్‌లో ఎలా..?
పరీక్ష సమయంలో తాను తొలుత బయాలజీ సెక్షన్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని, ఆ తర్వాతనే ఇతర సబ్జెక్ట్స్ క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఇచ్చినట్లు వత్స తెలిపాడు. తనకు నచ్చిన సబ్జెక్ట్ బయాలజీ అని, అందుకే ఆ సెక్షన్ పూర్తి చేసిన తర్వాత ఇతర సబ్జెక్ట్స్ క్వశ్చన్స్పైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు స్పష్టం చేశాడు. తనకు ఎగ్జామ్ క్లియర్ చేస్తానన్న నమ్మకం, పట్టుదల ఉన్నాయని పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి : రైల్ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..
* లక్ష్యం..?
ఢిల్లీ ఏయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, సర్జన్‌గా పనిచేయడం తన లక్ష్యమని వత్స చెబుతున్నాడు. అయితే ఫ్యూచర్లో అవకాశముంటే సివిల్ సర్విసెస్లోకి వస్తానని, ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వత్స చెప్పాడు. వైద్య వృత్తి ఉన్నతమైనదని, తనకు ఈ వృత్తిపైన అపార గౌరవముందని తెలిపాడు.
నీట్ ఎగ్జామ్‌లో టాప్ నాలుగు ర్యాంకులు సాధించిన అందరికీ పరీక్షలో 99 శాతం మార్కులొచ్చాయి. కాగా, ఢిల్లీకి చెందిన వత్స మాత్రం ఈ ఏడాది ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థిగా నిలిచాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Delhi, JOBS, NEET 2022, Success story