సీబీఎస్ఈ ఫలితాలు: 13 మంది విద్యార్థులకు 499/500.. మరిన్ని రికార్డులు..

మొత్తం 500 మార్కులకు గానూ 13 మంది విద్యార్థులు 499 మార్కులు దక్కించుకున్నారు. 25 మంది విద్యార్థులు 498 మార్కులు, 58 మంది విద్యార్థులకు 497 మార్కులు వచ్చాయి.

news18-telugu
Updated: May 6, 2019, 4:10 PM IST
సీబీఎస్ఈ ఫలితాలు: 13 మంది విద్యార్థులకు 499/500.. మరిన్ని రికార్డులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సీబీఎస్ఈ ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి. ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. విశేషమేమిటంటే.. మొత్తం 500 మార్కులకు గానూ 13 మంది విద్యార్థులు 499 మార్కులు దక్కించుకున్నారు. 25 మంది విద్యార్థులు 498 మార్కులు, 58 మంది విద్యార్థులకు 497 మార్కులు వచ్చాయి. రీజియన్ల వారీగా చూస్తే తిరువనంతపురం 99.85 శాతం పాస్ పర్సంటేజీతో తొలిస్థానంలో నిలిచింది. సిద్ధార్థ్ పెంగోరియా అనే విద్యార్థి టాపర్‌గా నిలిచినట్లు సీబీఎస్ఈ పేర్కొంది. ఆ తర్వాత దివ్యాంన్ష్ వాద్వా, యోగేశ్ కుమార్ గుప్తా, అంకుర్ మిశ్రా, వత్సల్ వర్షనే, మాన్య, ఆర్యన్ జా, తరు జా, భావన శివదాస్, ఇష్ మదన్, దివ్‌జ్యోత్ కౌర్ జగ్గీ, అపూర్వ జైన్, శివాని లత్ నిలిచారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 92.45 శాతం పాస్ కాగా, బాలురు 90.14శాతం మంది పాసయ్యారు. బాలురు, బాలికలను మించి 94.74 శాతం మంది ట్రాన్స్‌జెండర్లు పరీక్షల్లో పాసయ్యారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 99 శాతం మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టులు క్లియర్ చేశారు. ఆ తర్వాత జవహర్ నవోదయ విద్యాలయాలు 98.57 పాస్ పర్సంటేజీని సాధించాయి. ప్రభుత్వ పాఠశాలలు 71.91 శాతం పాస్‌తో చివరి స్థానంలో నిలిచాయి. ఇదిలా ఉండగా, గత ఏడాదితో పోల్చితే ఈ సారి పాస్ పర్సంటేజీ 5 శాతం పెరిగింది. ఫలితాలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ హర్షం వ్యక్తం చేశారు. పాస్ అయిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

రీజియన్ వారీగా పాస్ పర్సంటేజీ చూస్తే..
1. తిరువనంతపురం 99.85
2. చెన్నై 99.00
3. అజ్మీర్ 95.89
4. పంచకుల 93.725. ప్రయాగ్‌రాజ్ 92.55
6. భువనేశ్వర్ 92.32
7. పట్నా 91.86
8. డెహ్రాడూన్ 89.04
9. ఢిల్లీ 80.97
10. గువహటి 74.49

రీవాల్యుయేషన్‌ కోసం..
విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే cbse.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 వసూలు చేస్తారు. దరఖాస్తును ఈ నెల 24 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా సమర్పించాలి.

ఫలితాలు చెక్ చేసుకోండిలా..

  • www.cbseresults.nic.in లేదా www.cbse.nic.in సైట్‌ను ఓపెన్ చేయండి

  • హోం పేజీలోకి వెళ్లి  ‘క్లాస్ 10 రిజల్ట్స్ 2019’ పై క్లిక్ చేయండి

  • మీ రిజిస్ట్రేషన్ నంబరు లేదా రూల్ నంబరును, ఇతర వివరాలను ఎంటర్ చేయండి

  • ఫలితాలు స్క్రీన్‌పై చూపించాక, డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి

First published: May 6, 2019, 4:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading