హోమ్ /వార్తలు /jobs /

Success Story: పేపర్ బాయ్‌గా పనిచేస్తూ.. ఎలాంటి కోచింగ్ లేకుండా ఐఏఎస్ సాధించాడు.. అతడి సక్సెస్ స్టోరీ ఇదే..

Success Story: పేపర్ బాయ్‌గా పనిచేస్తూ.. ఎలాంటి కోచింగ్ లేకుండా ఐఏఎస్ సాధించాడు.. అతడి సక్సెస్ స్టోరీ ఇదే..

పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఏకంగా ఐఏఎస్ అయ్యాడు మధ్యప్రదేశ్‌కు చెందిన నిరీష్ రాజ్‌పుత్ అనే వ్యక్తి. అతడి సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఏకంగా ఐఏఎస్ అయ్యాడు మధ్యప్రదేశ్‌కు చెందిన నిరీష్ రాజ్‌పుత్ అనే వ్యక్తి. అతడి సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఏకంగా ఐఏఎస్ అయ్యాడు మధ్యప్రదేశ్‌కు చెందిన నిరీష్ రాజ్‌పుత్ అనే వ్యక్తి. అతడి సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

  చాలా మంది యువత ఐఏఎస్‌లు(IAS) కావాలని కలలు కంటుంటారు. వారి స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం(Central Government) ఆధ్వర్యంలోని యూపీఎస్‌సీ( Union Public Service) సివిల్స్(Civils) పరీక్షలను నిర్వహిస్తుంది. దేశంలో అత్యంత కఠిన పరీక్షల్లో ఇది ఒకటి. ఇందులో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు ఏళ్ల తరబడి సన్నద్ధమవుతుంటారు. ఎక్కువ మంది ఔత్సాహికులు కోచింగ్ సెంటర్లలో చేరితే.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు సొంతంగా ప్రిపేర్ అవుతుంటారు. ఇలా పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఏకంగా ఐఏఎస్ అయ్యాడు మధ్యప్రదేశ్‌కు(Madhya Pradesh) చెందిన నిరీష్ రాజ్‌పుత్ అనే వ్యక్తి. అతడి సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాకు చెందిన నిరీష్ రాజ్‌పుత్ కోచింగ్ లేకుండానే UPSC పరీక్షకు సిద్ధమయ్యాడు. ఆల్ ఇండియా లెవల్‌లో 370వ ర్యాంకు సాధించి IAS అధికారి కావాలనే తన కలను సాకారం చేసుకున్నాడు.

  Odisha news: వామ్మో.. ఇదేం పనిరా అయ్యా.. ఎన్నికలలో ఓడిపోయినందుకు ఎంత పనిచేశాడు..

  పేదరికం వెంటాడుతున్నా ఐఏఎస్ అధికారి కావాలన్న తన తన చిరకాల స్వప్నాన్ని ఎన్నో కష్టనష్టాలను భరించి నెరవేర్చుకున్నాడు. వీరి ఇళ్లు కేవలం 300 చదరపు అడుగులు మాత్రమే ఉంటుంది. తండ్రి వీరేంద్ర రాజ్‌పుత్.. టైలర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిరీష్‌కు ఇద్దరు సోదరులు ఉన్నారు. వీరు టీచర్ ఉద్యోగం చేస్తున్నారు.

  నిరీష్ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాల్లోనే చదువుకున్నాడు. పరీక్షల ఫీజుల కోసం ఇంటింటికి తిరిగి పేపర్ వేసేవాడు. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును మాత్రం ఆపలేదు నిరీష్. గాల్వియర్‌లోని ప్రభుత్వ కళాశాలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. ఇందు కోసం అతని సోదరులు సహాయం చేశారు. యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే ముందు ఐఎఎస్ అధికారి ఎలా కావాలో అతనికి తెలియదు. కానీ, UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధిస్తే ప్రజల జీవితాలను మార్చవచ్చన్న సంగతి అతనికి తెలుసు.

  ఆర్థిక ఇబ్బందులు కారణంగా యూపీఎస్‌సీ పరీక్షల కోసం ఇంటిలోనే ప్రిపేర్ అయ్యాడు. ఇందుకు అతని సోదరులు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో, ఉత్తరాఖండ్‌‌లో కొత్తగా ప్రారంభించిన కోచింగ్ సెంటర్‌లో భోదించడానికి తన స్నేహితుల్లోని ఒకరు నిరీష్‌ను సంప్రదించారు. ప్రతిఫలంగా యూపీఎస్‌సీ పరీక్షల కోసం స్టడీ మెటీరియల్స్ ఇస్తానని అతను నిరీష్‌కు హామీ ఇచ్చాడు.

  రెండేళ్లు గడిచేసరికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ బాగా వృద్ధి చెందింది. దీంతో నిరీష్ అవసరం లేదని భావించిన అతని స్నేహితుడు మోసం చేశాడు. రెండేళ్ల పాటు కోచింగ్ సెంటర్‌లో పాఠాలు చెప్పినా ప్రతిగా ఎటువంటి ప్రతిఫలం పోందలేదు నిరీష్. చేసేది లేక కట్టుబట్టలతో ఢిల్లీకి బయలుదేరాడు. అక్కడ యూపీఎస్‌సీ పరీక్షల కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు.

  గాల్లో బంతిలాగా ఎగిరి కిందపడ్డ యువకుడు.. బుల్ దెబ్బకు.. చావు తప్పి కన్ను లొట్టపోయిందిగా..

  యూపీఎస్‌సీ పరీక్షల కోసం ఢిల్లీలో సన్నద్ధమవుతున్న అనేక మంది ఔత్సాహికులను కలుసుకున్నాడు. ప్రిపరేషన్‌‌ ఎలా అవ్వాలో వారు నిరీష్‌ కు వివరించారు. ఎటువంటి కోచింగ్ సెంటర్‌లలో కోచింగ్ తీసుకోకుండానే తన నాలుగో ప్రయత్నంలో సివిల్స్ పరీక్షల్లో ఆల్ ఇండియా లెవల్‌లో 370వ ర్యాంకుతో సాధించి తన చిరకాల కోరిక ఐఏఎస్‌ను సాధించి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచాడు.

  First published:

  ఉత్తమ కథలు