హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Child Prodigy: పదేళ్లకే రెండు డాక్టరేట్లు.. ఆ బాల మేధావి సక్సెస్ స్టోరీ ఇదే..

Child Prodigy: పదేళ్లకే రెండు డాక్టరేట్లు.. ఆ బాల మేధావి సక్సెస్ స్టోరీ ఇదే..

Child Prodigy: పదేళ్లకే రెండు డాక్టరేట్లు.. ఆ బాల మేధావి సక్సెస్ స్టోరీ ఇదే..

Child Prodigy: పదేళ్లకే రెండు డాక్టరేట్లు.. ఆ బాల మేధావి సక్సెస్ స్టోరీ ఇదే..

ఏదైనా రంగంలో విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఓ బాలుడు. అతి చిన్న వయసులో డాక్టరేట్ పొంది చరిత్ర సృష్టించాడు ఆ బుడతడు.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ఏదైనా రంగంలో విజయం(Success) సాధించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఓ బాలుడు. అతి చిన్న వయసులో డాక్టరేట్ పొంది చరిత్ర సృష్టించాడు ఆ బుడతడు. తన ప్రతిభతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ బాలుడి పేరు అరిపిరాల యోగానంద శాస్త్రి. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు పర్యాయపదంగా నిలిచిన ఈ గుంటూరు స్టూడెంట్ విజయ గాథ.. ఈ తరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) గుంటూరుకు చెందిన అరిపిరాల యోగానంద శాస్త్రి బాల మేధావిగా పేరుపొందాడు. అతని వయసు 10 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే జ్యోతిష్యంలో డాక్టరేట్ పొంది అందరినీ ఆశ్చర్యపర్చాడు యోగానంద.

General Knowledge: TSPSC, APPSC పరీక్షలకు ఉపయోగపడే ప్రశ్నలు.. వీటికి సమాధానాలు మీకు తెలుసా..?

యోగానంద శాస్త్రి ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. వైదిక ఆచారాలను నిర్వహించడంలో, జన్మ నక్షత్రాలను చదవడంలో ప్రావీణ్యం పొందాడు. ఇతడు ఉచ్చారణ లోపం లేకుండా శ్లోకాలను పఠిస్తాడు. ఈ బాల మేధావి ఇప్పటివరకు 70 హోమాలు, బహుళ యజ్ఞాలు నిర్వహించాడు. యోగా‌నంద కుటుంబం ఎన్నో తరాల నుంచి జ్యోతిష్యాన్ని అభ్యసిస్తోంది. దీంతో అతడు కూడా చిన్నతనంలోనే ఈ రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు.

ఇన్‌ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, వారి మార్గదర్శకత్వంలో యోగానంద జ్యోతిష్య శాస్త్రంపై పూర్తి పట్టు సాధించాడు. ఈ క్రమంలో అతడు జ్యోతిష్యంపై పెంచుకున్న జ్ఞానం అపారమైనదని గుర్తించింది ప్రపంచ మానవ హక్కుల కమిటీ. యోగానంద ప్రతిభను గుర్తించిన ఈ సంస్థ ఇటీవల అతడికి రెండు డాక్టరేట్లు ప్రదానం చేసింది. జ్యోతిష్యంలో అతని పేరు మీద ఇప్పుడు రెండు గౌరవ డాక్టరేట్లు ఉన్నాయి. పదేళ్ల వయసులోనే రెండు డాక్టరేట్లు రావడంతో.. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, హార్వర్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో యోగానందకు చోటు దక్కింది.

యోగానంద తండ్రి డాక్టర్ అరిపిరాల కళ్యాణ్ శాస్త్రి మాట్లాడుతూ.. ‘యోగానంద ఐదేళ్ల వయసులోనే జాతకాలు చెప్పటానికి ఆసక్తి చూపించాడు. జ్యోతిష్యాన్ని బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో అతడు అంచనా వేస్తున్నాడు. దీంతో అందరూ నా కొడుకును బాల మేధావిగా పిలుస్తారు. ఐదేళ్ల నుంచే జ్యోతిష్యం, వాస్తు, వైదిక కర్మలను నిర్వహించే ప్రక్రియను నేర్చుకోవడం ప్రారంభించాడు.’ అని చెప్పుకొచ్చారు.

* స్పెషల్ యూట్యూట్ ఛానెల్

యోగానంద శాస్త్రి తన తండ్రి ప్రోత్సాహంతో జ్యోతిష్యంపై పట్టు సాధించాడు. కళ్యాణ్ శాస్త్రికి ఈ రంగంపై మంచి పట్టు ఉంది. దీంతో యోగానంద కూడా తండ్రి బాటలోనే నడుస్తూ, ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నాడు. భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం ద్వారా ప్రజల జీవితాల్లో శాంతి, విశ్వాసాన్ని తీసుకురావాలనేది అతని ఆకాంక్ష. జ్యోతిష్యం చెప్పడమే కాకుండా యోగానంద ఆధ్యాత్మిక సమస్యలకు పరిష్కారాల కోసం యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాడు. సంస్కృతి ప్రొడక్షన్స్ పేరుతో ఛానెల్‌ను రన్ చేస్తున్నాడు.

First published:

Tags: Career and Courses, JOBS, Students, Success story

ఉత్తమ కథలు