Home /News /jobs /

MEET DR AINDRILA SINGHA ROY WHO IMPROVED NEET PG RANK FROM 7300 TO 30 KNOW HER STRATEGY UMG GH

Success Story: నీట్ పీజీ ఫస్ట్ అటెమ్ట్‌లో 7300వ ర్యాంక్‌.. రెండోసారి ఆలిండియా 30వ ర్యాంక్.. ఒక మెడికో సక్సెస్‌ స్టోరీ

ఆలిండియా 30వ ర్యాంక్.. ఒక మెడికో సక్సెస్‌ స్టోరీ

ఆలిండియా 30వ ర్యాంక్.. ఒక మెడికో సక్సెస్‌ స్టోరీ

నీట్ పీజీ ఎగ్జామ్ ఫస్ట్ అటెమ్ట్‌లో లోపాలను తెలుసుకున్న ఒక యువతి.. సెకండ్ అటెమ్ట్‌లో ఆలిండియా 30వ ర్యాంక్‌ సాధించి ఆదర్శంగా నిలుస్తోంది. కష్టపడి చదివి, డాక్టర్‌ కావాలనే తల్లి కోరికను నిజం చేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
నీట్ పీజీ ఎగ్జామ్ ఫస్ట్ అటెమ్ట్‌లో లోపాలను తెలుసుకున్న ఒక యువతి.. సెకండ్ అటెమ్ట్‌లో ఆలిండియా 30వ ర్యాంక్‌ సాధించి ఆదర్శంగా నిలుస్తోంది. కష్టపడి చదివి, డాక్టర్‌ కావాలనే తల్లి కోరికను నిజం చేస్తోంది. ఆమే గౌహతికి చెందిన ఐంద్రిలా సింఘ రాయ్. నీట్‌ పీజీ(NEET PG)లో ఆమె ఆల్ ఇండియా 30వ ర్యాంక్ సాధించింది. మొదటి ప్రయత్నంలో ఆమెకు 7300వ ర్యాంక్ వచ్చింది. ఈ ఫలితాలతోనే మరింత కష్టపడి చదవడానికి ప్రేరణ లభించిందని ఆమె చెబుతోంది. ప్రస్తుతం మెడిసిన్ ఎండీ చదువుతోంది. తాను డాక్టర్‌ కావాలన్నదని తన తల్లి కోరికని, చాలా చిన్న వయసులోనే తనకు ఆ విషయం చెప్పారని పేర్కొంది.

* రెండో ప్రయత్నంలో
ఐంద్రిలా మాట్లాడుతూ.. ‘నీట్-పీజీలో ఇది నా సెకండ్ అటెమ్ట్. ఫస్ట్ అటెమ్ట్ నా బలహీనతలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. ముందు నాకు వచ్చిన ర్యాంక్, నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేను సరైన దిశలో చదువుతున్నానని అర్థం చేసుకున్నాను. ఇది నా రెండో ప్రయత్నానికి మరింత మెరుగ్గా సిద్ధం కావడానికి నాకు సహాయపడింది. మరింత కష్టపడి ఈ సంవత్సరం పరీక్షకు మళ్లీ హాజరయ్యాను. ఈసారి ఆలిండియా 30వ ర్యాంక్ సాధించాను’ అని చెప్పింది.

ఇదీ చదవండి:  ఓరి నీ సర్ప్రైజ్ పాడుగాను.. హారం పోయిందని పెళ్లికొడుకు నాటకం.. చివరికి ఏం జరిగిందంటే !


* కరోనా సమయంలో..
ఐంద్రీలా గౌహతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేయడంతోపాటు గతేడాది ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి గృహిణి. ఆమెకు ఒక సోదరుడు, కవల సోదరి కూడా ఉన్నారు. ఆమె సోదరుడు చార్టర్డ్ అకౌంటెంట్ కాగా, ఆమె సోదరి ఇంజినీర్.
మహమ్మారి సమయంలో ఆమె ఇంటర్న్‌షిప్ చేసింది. 2- 3 నెలలు ఆమె పనిచేసిన చోట కొవిడ్‌ కేంద్రాన్ని పర్యవేక్షించారు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలోనే ఆమె తన అమ్మమ్మని కోల్పోయినట్లు, మానసికంగా చాలా ఇబ్బందిపడినట్లు చెప్పింది. ఆస్పత్రిలో ఇతర రోగుల పరిస్థితులను చూసిన తర్వాత, కుటుంబంలోని రోగుల పరిస్థితిని చూసిన తర్వాత బలంగా మారానని చెబుతోంది. తనను డాక్టర్‌గా చూడాలనుకున్న అమ్మమ్మ కోరిన సంకల్పానికి ఆజ్యం పోసిందని ఐంద్రిలా News18.comతో పంచుకుంది.

* సోషల్‌ మీడియాకు పూర్తిగా దూరం
ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌ గురించి ఐంద్రిలా మాట్లాడుతూ..‘ప్రిపరేషన్‌ సమయంలో చాలా సానుకూలంగా ఉన్నాను. వీక్‌గా ఉన్న సబ్జెక్టులలో పట్టు సాధించడానికి అదనపు సమయం కేటాయించాను. నెగెటివ్‌ ఎనర్జీ దూరం చేయడానికి, చదువుపై మాత్రమే దృష్టి పెట్టడానికి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. చదివిన అంశాలను ఎక్కువ సార్లు రివిజన్‌ చేశాను. గ్రాండ్‌ టెస్ట్‌(GT)లు ప్రాక్టీస్‌ చేశాను. ప్రతి 3 నుంచి 4 రోజులకు గ్రాండ్‌ టెస్ట్‌ రాసేదాన్ని. గత మూడు నెలల్లో 24 గ్రాండ్‌ టెస్ట్‌లు పూర్తి చేశాను.’ అని వివరించింది.



* ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి
మొదటి, రెండవ సంవత్సరాలకు రివిజన్‌ కోసం ఐంద్రిలా ఫస్ట్‌-ఎయిడ్‌ బుక్‌ సిఫార్సు చేసింది. మూడు సంవత్సరాలకు స్టాండర్ట్ బుక్స్ సరిపోతాయని తెలిపింది. అయితే ఇంటర్న్‌షిప్ తర్వాత, NEET-PGకి సిద్ధమవుతున్నప్పుడు మాత్రం స్టాండర్ట్ పెంచాలని చెబుతోంది. ప్రిపరేషన్‌ టైమ్‌లో దృష్టి మరల్చే అంశాలకు దూరంగా ఉండాలని, ఎక్కువ సమయం చదివేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకుంటే ప్రశాంతంగా ఉంటుందని పీజీ నీట్‌ అభ్యర్థులకు ఐంద్రిలా సూచించింది.
Published by:Mahesh
First published:

Tags: JOBS, NEET, Neet exam, Success story

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు