మారుమూల గ్రామానికి చెందిన వారు కూడా చదువుల్లో రాణించగలరని నిరూపించింది అన్షికా పటేల్ (Anshika Patel). యూపీ (UP)లోని జౌన్పూర్ జిల్లా పక్రి గోడమ్(Pakri Godam)కు చెందిన ఈ 18 ఏళ్ల అమ్మాయి 100 శాతం స్కాలర్షిప్(Scholarship)తో యూఎస్‌లోని లీ యూనివర్సిటీ(Lee University)లో సీటు సంపాదించింది. గణితం(Maths)లో మైనర్‌తో పాటు ఎకనామిక్స్ మేజర్స్ చదవాలనుకుంటుంది. ఖతార్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి కూడా ఆమె ఎంపికైంది. అలాగే మరో ఐదు యూనివర్సిటీలు వెయిట్‌లిస్ట్‌లో ఉన్నాయి.
బులంద్‌షహర్‌లోని విద్యాజ్ఞాన్ లీడర్షిప్ అకాడమీలో 12వ తరగతి చదివిన ఆన్షిక, 95 శాతం మార్కులతో పాసైంది. 11, 12వ తరగతుల్లో ఇండియన్ ఎకానమీ, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ చదివింది. 10వ తరగతిలో 98 శాతం మార్కులు సాధించింది.
ఈ అమ్మాయి తండ్రి ఒక చిన్న జనరల్ స్టోర్‌లో పనిచేస్తుండగా, తల్లి టైలర్. అన్షికకు నలుగురు తోబుట్టువులు కూడా ఉన్నారు. “నేను లీ యూనివర్సిటీకి ఎంపికకావడంతో నా టీచర్, కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోవడంలో నా కుటుంబంలో నేనే మొదటి వ్యక్తిని.’’ అని చెప్పుకొచ్చింది అన్షిక.
తన భవిష్యత్ ప్రణాళికల గురించి అన్షిక ఇలా చెప్పుకొచ్చింది. ‘‘వాషింగ్టన్‌లోని లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నా. ఇందు కోసం బాగా చదువుకోవాలని నిర్ణయించుకున్నాను. NGOలు లేదా సామాజిక సేవా సంస్థలతో కలిసి సమాజ సంక్షేమం కోసం పని చేయడమే నా ప్రధాన లక్ష్యం.
2019లో విద్యాజ్ఞాన్ స్కూల్ ‘స్టూడెంట్ ఎక్సెంజ్ ప్రోగ్రామ్’లో భాగంగా యూఎస్ వెళ్లే అవకాశం కల్పించింది. దీంతో అక్కడి యూనివర్సిటీలు, కోర్సులు, ఫ్యాకల్టీ, ఇంటర్న్‌షిప్‌లను అన్వేషించడం ప్రారంభించాను. అకాడమీలో నా టీచర్, కౌన్సెలర్‌తో ప్రతిదీ చర్చించడం ద్వారా అడుగడుగునా వారు మార్గదర్శకంగా వ్యవహరించారు.’’ అని పేర్కొంది.
‘అమెరికాలో సాధారణ అడ్మిషన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అన్ని యూనివర్సిటీల్లో మనకు నచ్చిన దానికి దరఖాస్తు చేసుకోవడానికి ఉమ్మడి యాప్ అందుబాటులో ఉంది. అలాగే స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, సాధారణ స్కాలర్షిప్ ఫారమ్ కూడా ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా, నేను మూడు వ్యాసాలను సమర్పించాను. అలాగే ప్రొఫెసీఎన్సీ టెస్ట్‌లో పాల్గొన్నాను.’ అంటూ ఆన్షిక యూఎస్ యూనివర్సిటీల్లోని అడ్మిషన్ ప్రక్రియ గురించి చెప్పింది.
ఇది కూడా చదవండి : ఉద్యోగ వేటలో ఉన్నారా..? ఈవారం అప్లై చేసుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే..
లీ యూనివర్సిటీలో తన కోర్సులో భాగంగా ఎంటర్‌ప్రెన్యూయర్ ఎకనామిక్స్‌పై దృష్టి సారించనుంది. ఇందుకు తన తల్లే ప్రేరణ అని అన్షిక భావిస్తోంది. ‘‘మా గ్రామంలోని మహిళలకు ప్రాథమిక కుట్టు నైపుణ్యాలను నేర్పిస్తూ, ఆర్థికంగా స్వతంత్రులుగా మారేందుకు దోహదపడుతున్న నా తల్లి మహిళా-ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఒక చిన్న ఉదాహరణ.
మహిళా ఆర్థిక సాధికారత కుటుంబ స్థాయిలోనే కాకుండా సమాజం, దేశ స్థాయిలో గొప్ప పరివర్తనకు మార్గం సుగమం చేస్తుంది. ఇది ఎకనామిక్స్‌లో ప్రత్యేక ఆసక్తితో ఎంటర్ ప్రెన్యూయర్ ఎకనామిక్స్‌ను అధ్యయనం చేయడానికి నన్ను ప్రేరేపించింది’’. అని అన్షికా చెప్పుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, JOBS, Success story, USA, Uttar pradesh