హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Merit List Released: అసిస్టెంట్ ప్రొఫెసర్ల మెరిట్ జాబితా విడుదల.. వెబ్ సైట్ లో లిస్ట్..

Merit List Released: అసిస్టెంట్ ప్రొఫెసర్ల మెరిట్ జాబితా విడుదల.. వెబ్ సైట్ లో లిస్ట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని కొత్త వైద్య కళాశాలల్లో నియమించే ప్రొఫెసర్‌ పోస్టులకు ఎంపికైన వారి మెరిట్‌ జాబితాను అధికారులు వెల్లడించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రాథమిక మెరిట్ జాబితాను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలోని కొత్త వైద్య కళాశాలల్లో నియమించే ప్రొఫెసర్‌ పోస్టులకు ఎంపికైన వారి మెరిట్‌ జాబితాను అధికారులు వెల్లడించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రాథమిక మెరిట్ జాబితాను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది. ఇటీవల తెలంగాణ వైద్య మంత్రి హరీశ్‌రావు మూడు రోజుల్లోగా ఫలితాలు ప్రకటించాలని అధికారులను ఆదేశించగా తాజాగా.. వీరి జాబితాను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. అంతే కాకుండా.. అభ్యంతరాలు స్వీకరించేందుకు వచ్చే నెల ఒకటి వరకు (4 రోజులు) గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. మెరిట్ జాబితా, ఇతర వివరాల కోసం mhsrb.telangana.gov.in సందర్శించాలని సూచించారు.

ఇక.. ఈ కళాశాలల నిర్మాణం వేగవంతం చేసి, భారతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులు పొందేలా చూడాలని ఇటీవల మంత్రి హరీశ్ రావు సూచించారు.

తెలంగాణ ఏర్పిడి 9 సంవత్సరాల్లో 21 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కళాశాలల్లోని పనుల పురోగతిపై తన కార్యాలయంలో మంత్రి అధికారులతో ఇటీవల సమీక్ష నిర్వహిచారు. నేడు 9 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రిన్సిపల్స్, ఇంజినీర్లతో పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కొత్త వైద్య కళాశాలల ప్రారంభించే లక్ష్యంలో భాగంగా.. ఇప్పటికే 87 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్లు తెలిపారు. 210 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సిలింగ్‌ ద్వారా పోస్టింగ్‌లు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ మెరిట్ జాబితాలో అభ్యంతరాలను స్వీకరించి.. 10 రోజుల్లో తుది నియామక పత్రాలివ్వాలని ఆదేశించారు. గతేడాది 8 వైద్య కళాశాలలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్ , ఖమ్మం , కామారెడ్డి , వికారాబాద్, జనగామ, నిర్మల్ , భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఎంబీబీఎస్‌ కళాశాలలు కొత్త విద్యాసంవత్సనికి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ తొమ్మిదింటితో కలిపి వైద్య కళాశాలల సంఖ్య 26కు, ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 3690కి పెరుగనున్నట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మంత్రి కోరారు. ఇక కేంద్రం కొత్తగా 157 వైద్య కళాశాలలను మంజూరు చేయగా.. అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు.

First published:

Tags: JOBS, Telangana jobs

ఉత్తమ కథలు