Home /News /jobs /

MCC NEET 2019 MEDICAL COUNSELING COMMITTEE RELEASES FINAL LIST FOR UG ADMISSION ROUND 2 TODAY AT MCC NIC IN DETAILS​ BS

MCC NEET 2019: రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి.. ఇలా చూసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

MCC NEET 2019 Final List at mcc.nic.in: ఈ రోజు ఉదయం 10.30 గంటల నుంచి అలాట్‌మెంట్ లెటర్లను ఎంసీసీ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఎంసీసీ నీట్ కౌన్సెలింగ్-2019లో భాగంగా ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రకటించింది. ఈ రోజు ఉదయం 10.30 గంటల నుంచి అలాట్‌మెంట్ లెటర్లను ఎంసీసీ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 11 నుంచి 13 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ నెల 14న వీరికి ఛాయిస్ ఫిల్లింగ్ కోసం అవకాశం కల్పించారు. 15వ తేదీ నుంచి నిన్నటి వరకు సీట్ల కేటాయింపు కసరత్తు కొనసాగగా, ఇప్పుడు వివరాలను వెల్లడించింది. సీట్లు దక్కించుకున్న విద్యార్థులు 25లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి.

ఇదిలా ఉండగా, మాపప్ రౌండ్‌లో భాగంగా సెంట్రల్, డీమ్డ్, ఈఎస్‌ఐసీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు దరఖాస్తు, ఆగస్టు 16 వరకు ఫీజు చెల్లించాలి. అదే రోజు సాయంత్రం 5గంటల లోగా ఛాయిస్ ఫిల్లింగ్ లేదా లాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 17న సీట్లను కేటాయిస్తారు. 18న సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటిస్తారు. ఆగస్టు 20 నుంచి 26లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలి.

అలాట్‌మెంట్ లెటర్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

  • ఎంసీసీ వెబ్‌సైట్ www.mcc.nic.in ఓపెన్ చేయాలి

  • UG Medical Councelling ఆప్షన్ ఎంచుకోవాలి

  • Online Servicesలో Allotment Letter Round-2 పై క్లిక్ చేయాలి

  • కొత్త విండో ఓపెన్ అయ్యాక.. రూల్ నంబరు, పుట్టిన రోజును, సెక్యూరిటీ పిన్(క్యాప్చా)ను ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కితే అలాట్‌మెంట్ లెటర్ కనిపిస్తుంది.

  • దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోండి.

First published:

Tags: CAREER, Exams, NEET

తదుపరి వార్తలు