హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

MBA Outlook Report: క్యాట్ తర్వాత సీమ్యాట్​ వైపే చూస్తున్న ఎంబీఏ ఆశావహులు.. కారణం ఏంటంటే..

MBA Outlook Report: క్యాట్ తర్వాత సీమ్యాట్​ వైపే చూస్తున్న ఎంబీఏ ఆశావహులు.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎంబీఏ ప్రవేశాల కోసం క్యాట్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన ఎగ్జామ్​గా సీమ్యాట్​ నిలిచింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. తాజాగా, Shiksha.com, ఇన్ఫోఎడ్జ్​ లిమిటెడ్​ సంయుక్తంగా విడుదల చేసిన ఎంబీఏ అవుట్​లుక్​ రిపోర్ట్–2022 ఈ విషయాన్ని బయటపెట్టింది.

ఇంకా చదవండి ...

దేశంలోని ప్రతిష్టాత్మక బీ స్కూల్స్​లో ఎంబీఏ(MBA) సీటు దక్కించుకునేందుకు క్యాట్​ (కామన్​ ఎంట్రన్స్ టెస్ట్) ఎగ్జామ్​ క్రాక్​ చేయాల్సి ఉంటుంది. అయితే, క్యాట్​(CAT) వంటి కఠినమైన పరీక్షలో మంచి స్కోర్(Score)​ సాధించడం అంత సులువేమీ కాదు. దీని కోసం కఠోర శ్రమ, ప్రణాళిక బద్దమైన ప్రిపేరేషన్​(Preparation) అవసరం. లక్షలాది మంది విద్యార్థులు పోటీపడితే వారిలో కొంతమందికే సీట్లు దక్కుతాయి. దీంతో సీటు రాని వారు తర్వాతి సెషన్​ కోసం సిద్దమయ్యేవారు. దీని వల్ల దాదాపు ఏడాది కాలం వృధా అవుతుంది. అందుకే, క్యాట్​కు ప్రత్యామ్నాయంగా 2019 ఏడాదిలో సీమ్యాట్​ ఎంట్రన్స్​ టెస్ట్( Entrance Test) ప్రారంభమైంది. దీంతో, క్యాట్​లో మంచి స్కోర్​ రాని వారు నిరాశ చెందకుండా సీమ్యాట్​ ద్వారా ప్రవేశాలు పొందే అవకాశం లభిస్తుంది. అందుకే, ఎంబీఏ ప్రవేశాల కోసం క్యాట్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన ఎగ్జామ్​గా సీమ్యాట్​ నిలిచింది.

Jobs in Telangana: డిగ్రీ అర్హ‌త‌తో తెలంగాణ‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు వారం రోజులే చాన్స్‌!

ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. తాజాగా, Shiksha.com, ఇన్ఫోఎడ్జ్​ లిమిటెడ్​ సంయుక్తంగా విడుదల చేసిన ఎంబీఏ అవుట్​లుక్​ రిపోర్ట్–2022 ఈ విషయాన్ని బయటపెట్టింది. ఫైనాన్స్‌, హ్యూమన్​ రిసోర్స్ విభాగాల్లో క్యాట్ ద్వారా సీటు దక్కని విద్యార్థులు సీమ్యాట్​ పరీక్షను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారని ఎంబీఏ అవుట్​లుక్​ రిపోర్ట్​ స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం, కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్స్ టెస్ట్ (CMAT) భారతదేశంలో మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) చదవాలనుకునే అభ్యర్థులకు రెండవ ప్రత్నామ్నాయ ప్రవేశ పరీక్షగా అవతరించింది.

ఎంబీఏ విద్యకు రెండవ ప్రత్యామ్నాయంగా సీమ్యాట్​..

దక్షిణ భారతదేశం మినహా, ఇతర ప్రాంతాల్లో సీమ్యాట్​ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది. సీమ్యాట్​ అనేది దేశంలోని మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. ఈ పరీక్షను 2019 నుండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) నిర్వహిస్తోంది. కాగా, భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు ఎంబీఏ ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్నారు. డిగ్రీలో ఏ కోర్సు చేసినప్పటికీ ఎంబీఏ చేయగలిగే అవకాశం ఉండటంతో దీన్ని ఎంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

Jobs in NHPC: ఎన్‌హెచ్‌పీసీలో 133 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్

“ఎంబీఏ అనేది భారతీయ యువతలో అత్యంత డిమాండ్ ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ఒకటి. గ్లోబల్​ మార్కెట్​లో మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు పెరుగుతున్న అవకాశాల దృష్ట్యా క్యాట్​, సీమ్యాట్​ రాసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.”అని Shiksha.com చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వివేక్ జైన్ అన్నారు. ఎంబీఏ కళాశాలను ఎంచుకునే విషయానికి వస్తే.. చాలా మంది విద్యార్థులు కోర్సు ఫీజుల కంటే రిక్రూటర్‌లు, ప్లేస్‌మెంట్​ అవకాశాలను బట్టి ఆయా కళాశాలను ఎంపిక చేసుకునే ధోరణి పెరిగింది.

First published:

Tags: Career and Courses, Exams, Mba, Students

ఉత్తమ కథలు