హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

MBA After B.Tech Opportunities: బీటెక్ తర్వాత ఎంబీఏ చేస్తున్నారా.. అయితే ఈ ఉద్యోగ అవకాశాలు మీ కోసమే..

MBA After B.Tech Opportunities: బీటెక్ తర్వాత ఎంబీఏ చేస్తున్నారా.. అయితే ఈ ఉద్యోగ అవకాశాలు మీ కోసమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

MBA After B.Tech Opportunities: బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఉద్యోగాన్వేషణలో ఉంటారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించే వారు ప్రిపరేషన్ మొదలు పెడతారు. స్టాప్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ), యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి వెలువడే నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతూ ఉంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు ఉద్యోగాన్వేషణలో ఉంటారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించే వారు ప్రిపరేషన్ మొదలు పెడతారు. స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC), యూపీఎస్సీ(UPSC), స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల (State Public Service Commissions) నుంచి వెలువడే నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇక ప్రవేట్ ఉద్యోగం(Private Jobs) కోసం ప్రయత్నించే వారు ఎక్కువగా సాఫ్ట్ వేర్ రంగం వైపు మళ్లుతారు. ఇక ఉద్యోగం అంతగా అవసరం లేని వాళ్లు బీటెక్ తర్వాత ఎంటెక్(M Tech) చేస్తారు. ఈ ఎంటెక్ కూడా.. గేట్ ద్వారా ఎంటెక్ విద్యను అభ్యసించే వాళ్లు కొంతమంది ఉంటే.. పీజీఈసెట్(PGECET) ద్వారా ఎంటెక్ చేసే వారు మరికొందరు ఉంటారు. ఇక ఇవి రెండు కాకుండా.. బీటెక్ తర్వాత చాలా కొద్ది మంది మాత్రమే ఐసెట్ రాసి.. ఎంబీఏ చేస్తారు. అయితే బీటెక్ తర్వాత ఎంబీఏ చేయడం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా. ఈరోజు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎవరో తెలియని వారుండరు. అయితే సుందర్ పిచాయ్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎంబీఏ చేశాడని చాలా మందికి తెలుసు. బీటెక్ తర్వాత ఎంబీఏ చేయడం స్కిల్ డెవలప్‌మెంట్‌లో ప్రధాన భాగం అవుతుంది, ఇది మంచి ఉద్యోగ అవకాశాలకు దారి తీస్తుంది. బీటెక్ తర్వాత ఎంబీఏ కోర్సు చేస్తే ఎంత మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

Jobs In AP: ఏపీలో ఉద్యోగాలు .. హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో 104 పోస్టులకు నోటిఫికేషన్..

B.Tech తర్వాత MBA చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

BTech తర్వాత చాలా మంది విద్యార్థులు ఉద్యోగం లేదా MTech చేస్తారు. కానీ MBA చేస్తే ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షిస్తున్న అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

MBA డిగ్రీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది, విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా మంచి కంపెనీలలో ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పిస్తుంది.

ఇలా చేయడం వల్ల విద్యార్థులు టెక్నికల్ అండ్ మేనేజ్‌మెంట్‌లో నిష్ణాతులు అవుతారు.

MBA పూర్తి చేసిన తర్వాత, విద్యార్థులు టాప్ గ్లోబల్ బ్రాండ్‌లతో పనిచేసే అవకాశం ఉంటుంది.

MBA తర్వాత, మీరు మంచి జీతంతో కూడిన ఉద్యోగం పొందవచ్చు.

బీటెక్ తర్వాత ఎంబీఏ చేయడం వల్ల వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి కూడా ఉంటుంది. చాలా కెరీర్ అవకాశాలు అందుబాటులో ఉంటాయి.

ఎంబీఏకు అర్హత

ఈ కోర్సులో ప్రవేశం పొందడానికి అభ్యర్థులు ఏదైనా విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 50% మార్కులను కలిగి ఉండాలి.

ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా MBA కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

WIPRO: విప్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో జీతాల పెంపు.. ఎంత శాతం పెరుగుతాయంటే..

కెరీర్ అవకాశాలు

చాలా మంది విద్యార్థులు బి.టెక్ తర్వాత ఉద్యోగం వస్తే ఎంబీఏ చేయాల్సిన అవసరం ఏముందని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎంబీఏ తర్వాత మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. MBAలో విద్యార్థులు ఎంచుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా ప్రొఫైల్ మారవచ్చు. ఎంబీఏ తర్వాత కింద చెప్పిన విభాగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆర్థిక విశ్లేషకుడిగా మారవచ్చు.

-హ్యూమన్ రిసోర్సెస్‌లో సీనియర్ మేనేజ్‌మెంట్ పోస్టులలకు మీరు అర్హులు అవుతారు.

-స్వయం ఉపాధి పొందొచ్చు.

-ఆపరేషన్స్ మేనేజర్ గా మారవచ్చు.

- IT మేనేజర్ లేదా కన్సల్టెంట్ గా ఉద్యోగం ప్రారంభించవచ్చు.

సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్, వ్యాపార నిపుణుడు, డేటా ప్రాసెసింగ్ మేనేజర్ వంటి వాటిలో మారు ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.

Published by:Veera Babu
First published:

Tags: B tech, Career and Courses, JOBS, Mba, Students

ఉత్తమ కథలు