భారత ప్రభుత్వం డిఫెన్సీ మినిస్ట్రీకి (Ministry of Defence) చెందిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1501 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తుకు ఫిబ్రవరి 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
విభాగాలు: కంప్రెసర్ అటెండెంట్, బ్రాస్ ఫినిషర్, ఏసీ రిఫ్రిజిరేషన్, ఎలక్ట్రికల్ క్రేన్ ఆపరేటర్స్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, జూనియర్ క్యూసీ ఇన్స్పెక్టర్, గ్యాస్ కట్టర్, ప్లానర్ ఎస్టిమేటర్, స్టోర్స్ కీపర్, ఫిట్టర్, ఫైర్ ఫైటర్, పైప్ ఫిట్టర్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతల వివరాలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి. టెన్త్, సంబంధిత ట్రేడుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు కాంటినెన్సీ సర్టిఫికేట్ తో పాటు అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
వయో పరిమితి: అభ్యర్థులకు జనవరి 1 నాటికి 18 నుంచి 38 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Jobs in Vizag Steel: వైజాగ్ స్టీల్లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ఎంపిక ఇలా:
రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకోసం ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ లో అభ్యర్థులు సాధించిన మార్కులు, అనుభవం, ట్రేడ్/స్కిల్ టెస్త్ లో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. రాత పరీక్ష (Written Exam) మొత్తం 30 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 10 ప్రశ్నలు, క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి మరో 10, టెక్నికల్ నాలెడ్జ్ కు సంబంధించిన మరో 10 ప్రశ్నలు ఉంటాయి. అంటే మొత్తం 30 మార్కులకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఎగ్జామ్ మార్చి 15న ఉంటుంది.
Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... ఈ తప్పు చేస్తే జీవితంలో రైల్వే ఉద్యోగం రాదు
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://mazagondock.in/ను ఓపెన్ చేయాలి.
Step 2: తర్వాత కెరీర్స్ విభాగంలో ఆన్లైన్ రిక్రూట్మెంట్ విభాగంలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 3: కావాల్సిన వివరాలను నమోదు చేసి అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Step 4: ఈ మెయిల్ కు వచ్చిన వ్యాలిడేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 5: తర్వాత MDL ఆన్లైన్ పోర్టల్ యూజర్ నేమ్, పాస్వర్డ్ నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
Step 6: తర్వాత కావాల్సిన జాబ్ ను ఎంచుకుని, వివరాలను నమోదు చేసి అప్లై చేసుకోవాలి.
Step 7: అభ్యర్థులు ఇతన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Defence Ministry, Job notification, JOBS