Home /News /jobs /

MAZAGON DOCK RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR 410 TRADE APPRENTICE POSTS SS

Jobs: మజగాన్ డాక్‌లో 410 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jobs: మజగాన్ డాక్‌లో 410 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs: మజగాన్ డాక్‌లో 410 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Mazagon Dock Recruitment 2021 | ఎనిమిదో తరగతి, టెన్త్, ఐటీఐ పాసైనవారికి గుడ్ న్యూస్. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్-MDL 410 పోస్టులున్నాయి.

    నిరుద్యోగులకు శుభవార్త. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్-MDL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 410 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 11 చివరి తేదీ. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2021 ఫిబ్రవరిలో ఉంటాయి. మూడు కేటగిరీల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. 8వ తరగతి, టెన్త్, ఐటీఐ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://mazagondock.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    Mazagon Dock Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 410

    టెన్త్ అర్హతతో గ్రూప్ ఏ ఖాళీలు- 205
    ఎలక్ట్రీషియన్- 31
    ఫిట్టర్- 57
    పైప్ ఫిట్టర్- 74
    స్ట్రక్చరల్ ఫిట్టర్- 43

    ఐటీఐ అర్హతతో గ్రూప్ బీ ఖాళీలు- 126
    ఐసీటీఎస్ఎం- 15
    ఎలక్ట్రానిక్ మెకానిక్- 29
    ఫిట్టర్ స్ట్రక్చరల్- 54
    కార్పెంటర్- 28

    8వ తరగతి అర్హతతో గ్రూప్ సీ ఖాళీలు- 79
    రిగ్గర్- 40
    వెల్డర్- 39

    Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

    IDBI Bank Jobs: ఐడీబీఐ బ్యాంకులో 134 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

    Mazagon Dock Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 23
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 11
    అడ్మిట్ కార్డుల విడుదల- 2021 ఫిబ్రవరి మొదటి వారం
    ఆన్‌లైన్ ఎగ్జామ్- 2021 ఫిబ్రవరి రెండో వారం
    విద్యార్హతలు- 8వ తరగతి, టెన్త్, ఐటీఐ
    వేతనం- గ్రూప్ ఏ పోస్టుకు మొదటి ఏడాది రూ.6,000, రెండో ఏడాది రూ.6600. గ్రూప్ బీ పోస్టుకు రూ.8050. గ్రూప్ సీ పోస్టుకు మొదటి ఏడాది రూ.5,000, రెండో ఏడాది రూ.5500.
    వయస్సు- గ్రూప్ ఏ పోస్టుకు 15 నుంచి 19 ఏళ్లు. గ్రూప్ బీ పోస్టుకు 16 నుంచి 21 ఏళ్లు. గ్రూప్ సీ పోస్టుకు 14 నుంచి 18 ఏళ్లు.
    దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు