MDL Recruitment 2021: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 1388 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

MDL Recruitment 2021: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 1388 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

MDL Recruitment 2021 | మజగాన్ డాక్ లిమిటెడ్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 1388 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 1388 పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు. ఆ తర్వాత మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 4 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://mazagondock.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    MDL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 1388
    ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిక్- 5
    కంప్రెషర్ అటెండెంట్- 5
    కార్పెంటర్- 81
    చిప్పర్ గ్రైండర్- 13
    కంపోజిట్ వెల్డర్స్- 132
    డీజిల్ క్రేన్ ఆపరేటర్- 5
    డీజిల్ కమ్ మోటార్ మెకానిక్- 4
    జూనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)- 52
    జూనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (ఎలక్ట్రికల్)- 2
    ఎలక్ట్రీషియన్- 204
    ఎలక్ట్రానిక్ మెకానిక్- 55
    ఫిట్టర్- 119
    జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ (మెకానికల్)- 13
    గ్యాస్ కట్టర్- 38
    మెషినిస్ట్- 28
    మిల్‌రైట్ మెకానిక్- 10
    పెయింటర్- 100
    పైప్ ఫిట్టర్- 140
    రిగ్గర్- 88
    స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్- 125
    స్టోర్ కీపర్- 10
    యుటిలిటీ హ్యాండ్- 14
    ప్లానర్ ఎస్టిమేటర్ (మెకానికల్)- 4
    ప్లానర్ ఎస్టిమేటర్ (ఎలక్ట్రికల్)- 4
    పారామెడిక్స్- 2
    సెమీస్కిల్ట్ యుటిలిటీ హ్యాండ్- 135

    Govt Jobs after 10th: టెన్త్ పాస్ అయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే

    NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    MDL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 11
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 4
    అర్హులైన అభ్యర్థుల జాబితా విడుదల- 2021 జూలై 15
    అనర్హతకు సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చివరి తేదీ- 2021 జూలై 22
    ఆన్‌లైన్ ఎగ్జామ్- 2021 జూలై

    MDL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
    వయస్సు- 18 నుంచి 38 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
    దరఖాస్తు ఫీజు- రూ.100

    UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    DRDO Recruitment 2021: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

    MDL Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    అభ్యర్థులు ముందుగా https://mazagondock.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    కెర్సీర్స్ సెక్షన్‌లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్‌లో నాన్ ఎగ్జిక్యూటీవ్ సెక్షన్ సెలెక్ట్ చేయాలి.
    అందులో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
    మీ మెయిల్ ఐడీకి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వస్తుంది.
    ఆ వివరాలతో లాగిన్ కావాలి.
    మీ వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
    దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
    దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: