ఇన్స్యూరెన్స్ రంగం... ఇటీవల బాగా విస్తరిస్తున్న రంగం. ఇన్స్యూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. ఇన్స్యూరెన్స్ కంపెనీలు భారీగా ఉద్యోగాలను నియమించుకుంటున్నాయి. ఏజెంట్ల నుంచి ఆఫీసర్ స్థాయి వరకు భారీ స్థాయిలోనే నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. ప్రైవేట్ లైఫ్ ఇన్య్సూరెన్స్ కంపెనీ అయిన మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ భారీగా ఉద్యోగాలను నియమించుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 ఏజెంట్ అడ్వైజర్లను నియమించుకోనున్నట్టు మ్యాక్స్ లైఫ్ ప్రకటించింది. నియామక ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలో చేస్తామని కంపెనీ ప్రకటించింది.
డిజిటల్ రిక్రూట్మెంట్ ప్రయాణం మా ఏజెన్సీలో అత్యున్నత నాణ్యత, ప్రతిభగల వారిని నియమించుకోవడానికి మాత్రమే కాదు, చురుగ్గా, వేగంగా, ప్రభావవంతంగా నియామక ప్రక్రియ చేపట్టడానికి కూడా ఉపయోగపడిందని మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వి విశ్వనాద్ తెలిపారు. కస్టమర్ల ప్రతినిధులుగా సేవలు అందించేందుకు విభిన్న వర్గాలకు చెందినవారిని నియమించుకునేలా రిక్రూట్మెంట్ వ్యూహాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ రిక్రూట్మెంట్ ద్వారా 23,000 మంది ఏజెంట్ అడ్వైజర్లను నియమించుకోనుంది.
క్వాలిటీ ఏజెంట్ రిక్రూట్మెంట్ కోసం 'వెబ్ టు రిక్రూట్ ప్రోగ్రామ్'ను ప్రారంభించింది మ్యాక్స్ లైఫ్. దీంతో పాటు కొత్త ట్రైనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ 'మ్యాక్స్ లైఫ్ ఏస్ టాక్' ప్రారంభించింది. ఇందులో మ్యాక్స్ లైఫ్ ఏజెంట్ అడ్వైజర్ల స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయి. ఇవి ఇతర ఏజెంట్లకు స్ఫూర్తినిస్తాయి. గతేడాది కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో ప్రజల్లో ఇన్స్యూరెన్స్ తీసుకోవాలన్న అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలతో పాటు టర్మ్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలకూ డిమాండ్ పెరిగింది. అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలకు బిజినెస్ పెరిగింది. దీంతో ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కూడా పెరిగాయి. ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ భారీగా నియామక ప్రక్రియ చేపడుతున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.