హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

APPSC Group 1: ఫోన్ చూస్తూ గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్థి.. చివరకు ఏం జరిగిందంటే..

APPSC Group 1: ఫోన్ చూస్తూ గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్థి.. చివరకు ఏం జరిగిందంటే..

APPSC Group 1: ఫోన్ చూస్తూ గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్థి.. చివరకు ఏం జరిగిందంటే..

APPSC Group 1: ఫోన్ చూస్తూ గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్థి.. చివరకు ఏం జరిగిందంటే..

ఏపీపీఎస్సీ నేడు(జనవరి 08, 2023) గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. 92 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రాథమక పరీక్షలో ఓ అభ్యర్థి పరీక్ష హాల్లో మొబైల్ చూస్తూ పరీక్ష రాశాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఏపీపీఎస్సీ(APPSC) నేడు(జనవరి 08, 2023) గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది.  92 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రాథమక పరీక్షలో ఓ అభ్యర్థి పరీక్ష హాల్లో మొబైల్ చూస్తూ  పరీక్ష(Exam)  రాశాడు. వివరాల్లోకి వెళ్తే.. మొత్తం 18 జిల్లాల్లో 297 సెంటర్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష జరగ్గా.. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్ 2 పరీక్షను నిర్వహించారు. అయితే విజయవాడ బెంజి సర్కిల్ లోని నారాయణ కళాశాలలో ఓ అభ్యర్థి కేంద్రంలోకి మొబైల్ ఫోన్ ను తీసుకెళ్లాడు. పోరంకి సచివాలయంలో పని చేస్తున్న ఆ ఉద్యోగి గూగుల్ ఓపెన్ చేసి మరీ పరీక్షలోని ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాడు. ఇలా జవాబులు రాస్తుండగా.. అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇక ఈ గ్రూప్ 1 పరీక్షకు 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగ 75 శాతానికిపైగా హాజరైనట్లు తెలుస్తోంది. ప్రశ్నల సరళి విధానంపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వెల్లడైంది. పలు ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉందని.. వాటిని చదివి అర్థం చేసుకునే సరికి సమయం అంతా అయిపోయిందని అభ్యర్థులు తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు గర్తించలేక పోయామని వాపోయారు. రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉండే ఈ పోస్టులకు ఆ మాత్రం పేపర్ స్టాండర్డ్ ఉండాల్సిందే అంటూ కొంత మంది అభ్యర్థులు తెలిపారు.

ఇక ఈ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు మూడు వారాల్లోకి వెల్లడికానున్నాయి. ఫలితాలు వెల్లడించిన 90 రోజుల వ్యవధిలోనే మెయిన్స్‌కూడా నిర్వహించనున్నట్లు ఇటీవల ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. అనంతరం జవాబుపత్రాల మూల్యాంకనానికి రెండు నెలల సమయం పడుతుందని.. ఆ తర్వాత నెలలోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి ఆగస్టులోగా నియామకాలు పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. అంతే కాకుండా.. ప్రభుత్వం ఆమోదం లభిస్తే.. ఈ సెప్టెంబర్ లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా తెలిపారు.

CBSE Counseling: CBSE విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి సైకలాజికల్ కౌన్సెలింగ్ ప్రారంభం..

ఇదిలా ఉండగా..మొత్తం 92 పోస్టులకు విడుదలైన ఈ గ్రూప్ 1 పోస్టులకు అదనంగా మరో 19 పోస్టులు కలిపారు. 2018లో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ లోని 167 పోస్టుల్లో 19 మంది జాయిన్ అవ్వలేదు. ఆ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ కు జత చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ పోస్టులకు సంబంధించి కొన్ని అంశాలు న్యాయస్థానం విచారణలో ఉన్నందున కోర్టు తుది తీర్పునకు లోబడి వీటిని భర్తీ చేస్తామని ఇటీవల APPSC పేర్కొంది. కొత్తగా జత చేసిన 19 పోస్టుల్లో 2 పోస్టులు మిగలగా.. 17 పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు జాయిన్ అవ్వలేదు.

First published:

Tags: APPSC, JOBS

ఉత్తమ కథలు