• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • MARKETING JOBS IN PHONE PAY IN VARIOUS DISTRICTS OF AP NS

APSSDC Jobs: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. PhonePeలో ఉద్యోగాలు

APSSDC Jobs: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. PhonePeలో ఉద్యోగాలు

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) శుభవార్త చెప్పింది. ఇప్పటికే అనేక మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన సంస్థ తాజాగా మరో ప్రకటన చేసింది. ప్రముఖ మొబైల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే(PhonePe)లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టినట్లు తెలిపింది.

  • Share this:
    ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) శుభవార్త చెప్పింది. ఇప్పటికే అనేక మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన సంస్థ తాజాగా మరో ప్రకటన చేసింది. ప్రముఖ మొబైల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే(PhonePe)లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టినట్లు తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారీగా మొత్తం 75 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే అభ్యర్థులు ద్విచక్రవాహనంతో పాటు, ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉండాలని తెలిపింది. అయితే ఈ పోస్టుకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 25 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

    ముఖ్య వివరాలు:
    సంస్థ పేరు: ఫోన్ పే
    పోస్టు: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
    విద్యార్హత: ఇంటర్, డిగ్రీ
    జీతం: 11,500+PF+ఇన్సూరెన్స్+ఇన్సెంటీవ్స్(రూ. 3000-రూ. 5,000)
    అనుభవం: సేల్స్ విభాగంలో కనీసం ఆరు నెలలు పని చేసి ఉండాలి, ఖాళీలు: 75



    ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు:
    అనంతపూర్-5
    చిత్తూరు&తిరుపతి-2
    గుంటూరు అర్బన్-2
    కాకినాడ-7
    కర్నూల్-2
    ప్రకాశం-4
    రాజమండ్రి-2
    విజయవాడ సెంట్రల్&ఈస్ట్-7
    విజయవాడ వెస్ట్-4
    వైజాగ్-24
    విజయనగరం&శ్రీకాకుళం-8
    వెస్ట్ గోదావరి-6
    వైఎస్సార్ కడప-2
    Registration-Direct Link
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు