Home /News /jobs /

MARKETING ACADEMY APPLICATIONS FELLOWSHIP PROGRAMME HERE IS THE DETAILS AK GH

Marketing Academy: కొత్త ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు ఆహ్వానించిన మార్కెటింగ్ అకాడమీ.. ఇలా అప్లై చేయండి ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మెకిన్సే అండ్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ ప్రొగ్రామ్‌ను అభివృద్ధి చేశారు. సీఎంఓ క్లబ్ దీన్ని స్పాన్సర్ చేస్తుంది. ఫెలోషిప్ కోసం గరిష్ఠంగా 20 మంది సీఎంఓలు లేదా మార్కెటింగ్ డైరెక్టర్లను మాత్రమే ఎంపిక చేస్తారు.

వచ్చే ఏడాదికి సంబంధించిన ఈఎంఈఏ (EMEA) ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది మార్కెటింగ్ అకాడమీ. దీన్ని సీఎంఓల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. సీఈఓ స్థానానికి మారడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రాంను డిజైన్ చేశారు. మెకిన్సే అండ్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ ప్రొగ్రామ్‌ను అభివృద్ధి చేశారు. సీఎంఓ క్లబ్ దీన్ని స్పాన్సర్ చేస్తుంది. ఫెలోషిప్ కోసం గరిష్ఠంగా 20 మంది సీఎంఓలు లేదా మార్కెటింగ్ డైరెక్టర్లను మాత్రమే ఎంపిక చేస్తారు.

ఈ తొమ్మిది నెలల ఉచిత ప్రొగ్రామ్‌ను మూడు ఈవెంట్ల ద్వారా అందిస్తారు. 2022 జనవరి నుంచి అక్టోబర్ మధ్య మూడు ఈవెంట్లకు 12 రోజుల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. మెకిన్సే నిపుణులు అందించే మాస్టర్ క్లాసులకు అభ్యర్థులు హాజరు కావచ్చు. దీంతోపాటు లీడర్‌షిప్ ఎక్స్‌పర్ట్ థామస్ బార్టా నేతృత్వంలోని సీఎంఓ టూ సీఈఓ లీడర్‌షిప్ జర్నీ.. ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్ కోచ్‌లతో వన్- టూ- వన్ సెషన్లు.. ఉన్నతస్థాయి అధికారులు, సీఈఓలు, నాన్- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఏర్పాటు చేసే మీడియా ట్రైనింగ్ అండ్ మెంటారింగ్ సెషన్స్.. వంటి వాటికి ఫెలోషిప్‌కు ఎంపికైన వారు యాక్సెస్ పొందవచ్చు.

ఈ యాన్యువల్ ప్రోగ్రాంను ఇప్పటి వరకు 150 మంది ప్రముఖులు పూర్తి చేశారట. డియాజియో గ్లోబల్ సీఎంఓ క్రిస్టినా డైజండినో, సైన్స్ బరీస్ సీఎంఓ మార్క్ గివెన్, అమెజాన్ గ్లోబల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ క్లాడిన్ చీవర్, టీయూఐ గ్రూప్ సీఎంఓ ఫ్రాన్స్ లీనార్స్, యూనిలివర్ గ్లోబల్ గ్రోత్ ఆఫీసర్ డెబోరో కోయమా వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఆసక్తి గలవారు మార్కెటింగ్ అకాడమీ వెబ్ సైట్ ద్వారా అక్టోబర్ 22 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మార్కెటింగ్ అకాడమీ లాభాపేక్ష లేని సంస్థ. యువకుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ కమ్యునికేషన్ తదితర విభాగాలు ఇందులో ఉన్నాయి.

BJP: రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీజేపీ ప్లాన్.. రంగంలోకి ముఖ్యనేతలు.. కొంతవరకు సక్సెస్ సాధించిందా ?

Heart Attack: గుండెపోటు ఎక్కువగా వచ్చేది ఈ రోజే.. అధ్యయనంలో వెల్లడి.. కారణం ఏంటంటే..

CEOలు, బోర్డు డైరెక్టర్ల రిస్క్ తీసుకునే సామర్థ్యాలను ఈ ప్రోగ్రాం విశ్లేషించడంతో పాటు సంబంధిత విభాగాల్లో అవసరమైన నైపుణ్యాలను బోధిస్తుంది. వారు తమ వ్యాపార వృద్ధి, మేధోపరమైన అభివృద్ధి, సరైన అవకాశాలను గుర్తించగల సామర్థ్యంతో పాటు కస్టమర్లకు ఏం కావాలో అర్థం చేసుకునే సామర్థ్యం గురించి కూడా లోతైన అవగాహన కలిగి ఉండాలి. ఇలాంటి అంశాలను మార్కెటింగ్ అకాడమీ తాజా ఫెలోషిప్‌ ద్వారా నేర్పించనున్నారు. భవిష్యత్తులో CEO లేదా బోర్డు మెంబర్‌గా బాధ్యతలు చేపట్టే మార్కెటింగ్ లీడర్స్‌కు అవసరమైన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఈ కార్యక్రమం ద్వారా అభ్యర్థులు పొందవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: EDUCATION

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు