Digital Education: డిజిటల్ విద్యపై 80% విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం ఇదే...

Digital Education | డిజిటల్ యాక్సెస్ ఉన్న ఇళ్లలో, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అందించడానికి వాట్సాప్ని75% మంది ఉపయోగిస్తున్నారని ఆక్స్ఫామ్ అధ్యయనం కనుగొంది.

news18-telugu
Updated: September 15, 2020, 5:16 PM IST
Digital Education: డిజిటల్ విద్యపై 80% విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం ఇదే...
Digital Education: డిజిటల్ విద్యపై 80% విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం ఇదే... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
లాక్డౌన్ సమయంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యార్థులకు విద్య చేరిందా? లేదా? అనే విషయంపై ఆక్స్ఫామ్ ఇండియా సర్వే నిర్వహించింది. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా మరియు ఉత్తరప్రదేశ్లోని 1,158 మంది తల్లిదండ్రులు మరియు 488 మంది ఉపాధ్యాయులతో మే మరియు జూన్ మధ్య ఈ సర్వే జరిగింది. కాగా ఈ సర్వే మధ్యాహ్నం భోజనం సరఫరాతో సహా పలు ప్రాంతాలలో విద్యార్థులపై దీర్ఘకాలిక లాక్డౌన్ ప్రభావాన్ని అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా సర్వేలో పాల్లొన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో దాదాపు 80 శాతానికి పైగా తమ పిల్లలకు విద్య చేరలేదని అభిప్రాయ పడ్డారు. ఈ సర్వే మొత్తం ఐదు-రాష్ట్రాల్లో జరిగింది. ఎక్కువ కుటుంబాలకు డిజిటల్ పరికరాలు మరియు డిజిటల్ మాధ్యమాలు అందుబాటులో లేనందున విద్య అందలేదని ఈ సర్వే తేల్చింది. భారతదేశ గ్రామీణ కుటుంబాలలో కేవలం 15% మందికి మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దళితులు, ఆదివాసులు మరియు ముస్లింలు వంటి అట్టడుగు సామాజిక సమూహాలలో ఈ సమస్య అధికంగా ఉంది. పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేకపోవడం వల్ల డిజిటల్ యాక్సెస్ సమస్య మరింత పెరిగింది.

Oxfam India Survey, digital education, lockdown digital classes, online learning, online classes, ఆక్స్‌ఫామ్ ఇండియా సర్వే, ఆన్‌లైన్ క్లాసులు, డిజిటల్ క్లాసులు, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్
ప్రతీకాత్మక చిత్రం


80% మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్లైన్లో క్లాసులు వినడానికి పాఠ్యపుస్తకాలు లేవని చెప్పారు. తరగతులు ప్రారంభమయ్యే ముందు పాఠ్యపుస్తకాలు పిల్లలకు చేరడం అత్యవసరం అని అధ్యయనంలో పాల్గొన్న 71% ఉపాధ్యాయులు తెలిపారు. మహమ్మారి కారణంగా భారతదేశంలో పాఠశాలలు మార్చిలో మూసివేయబడ్డాయి, అయితే జూన్ నాటికి ఆన్లైన్లో తరగతులు తిరిగి ప్రారంభించబడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో, కోవిడ్–19 ప్రభావం విద్యను అందించడమే కాకుండా అభ్యాస సామగ్రి మరియు మధ్యాహ్నం భోజనం వంటి అదనపు అర్హతలను కూడా ప్రభావితం చేసిందని అధ్యయనం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో విద్య పంపిణీ కూడా ప్రభావితమైంది. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో 59% తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్య అందలేదని పేర్కొన్నారు.

Oxfam India Survey, digital education, lockdown digital classes, online learning, online classes, ఆక్స్‌ఫామ్ ఇండియా సర్వే, ఆన్‌లైన్ క్లాసులు, డిజిటల్ క్లాసులు, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్
ప్రతీకాత్మక చిత్రం


భారతదేశంలో 320 మిలియన్ల మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలను మూసివేయడం వల్ల వారిలో అభ్యాస సామర్ధ్యాలు, ఆహార భద్రత మరింత దిగజారిపోతాయి. అంతేకాక ఆర్థిక మరియు సామాజిక అంతరాలు బాగా పెరుగుతాయని డ్రీమ్ ఎ డ్రీం అనే ఎన్జిఓ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 24 మిలియన్ల పాఠశాల పిల్లలు తప్పుకునే అవకాశం ఉందని యుఎన్ నివేదిక తెలిపింది. డిజిటల్ యాక్సెస్ ఉన్న ఇళ్లలో, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అందించడానికి వాట్సాప్ని75% మంది ఉపయోగిస్తున్నారని ఆక్స్ఫామ్ అధ్యయనం కనుగొంది.
ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం, ఇంటర్నెట్ వేగం/సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల తమ పిల్లలు ఇబ్బందిపడుతున్నారని 75% కంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా ఇంటర్నెట్ వేగం మరియు సిగ్నల్ గురించి ఫిర్యాదు చేశారు.
కాగా విద్యార్థులు మరియు తల్లిదండ్రులే కాదు 84% మంది ఉపాధ్యాయులు డిజిటల్ విద్యతో సమస్యలను ఎదుర్కొన్నారని చెప్పారు. వారిలో సగం మంది ఇంటర్నెట్ సిగ్నల్ మరియు డేటా ఖర్చులతో సమస్యల గురించి తెలిపారు. పాఠశాలలు మూసివేయడం వల్ల కొన్ని వర్గాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.భారతదేశంలో 115 మిలియన్ల మంది పిల్లలు మహమ్మారి కారణంగా పోషకాహార లోపానికి గురవుతున్నారని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. వారిలో, ఆదివాసీ మరియు దళిత వర్గాలకు చెందిన పిల్లలు మధ్యాహ్నం భోజనంపై ఆధారపడటం వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది.

Oxfam India Survey, digital education, lockdown digital classes, online learning, online classes, ఆక్స్‌ఫామ్ ఇండియా సర్వే, ఆన్‌లైన్ క్లాసులు, డిజిటల్ క్లాసులు, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్
ప్రతీకాత్మక చిత్రం


యునిసెఫ్ నిధులు సమకూర్చిన ఒక నివేదిక ప్రకారం, కౌమారదశలో ఉన్న బాలికలు పోషకాహార లోపం సమస్యలతో బాధపడుతున్నారు అని తేలింది.ఆక్స్ఫామ్ సర్వే ప్రకారం15% కంటే తక్కువ దళిత, ఆదివాసీ మరియు ముస్లిం కుటుంబాలకు మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది. అందువల్ల వారు మునుపటి సంవత్సరపు అభ్యాసాలలో దాదాపు 40% కోల్పోయే అవకాశాలున్నాయి. పిల్లలకు మద్యాహ్న భోజనం అందించాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ 35% మంది పిల్లలు తమ మధ్యాహ్నం భోజనం పొందలేదని సర్వే తెలిపింది. ఈ భోజనం పొందిన 65% మంది పిల్లలలో, 8% మాత్రమే వండిన భోజనం పొందారు; 53% మందికి డ్రై రేషన్లు, 4% మందికి ప్రత్యక్ష ప్రయోజన బదిలీగా డబ్బు లభించింది.

తీసుకోవాల్సిన చర్యలు

1. పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడానికి త్వరగా చర్యలు తీసుకోవాలి. వండిన భోజనం/ పొడి రేషన్లను సురక్షితంగా విద్యార్థల ఇంటికే డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలి.
2. పాఠశాలలు తిరిగి తెరవడానికి ముందే తగిన వాష్ సౌకర్యాలు (నీరు, సబ్బు మరియు ఫంక్షనల్ టాయిలెట్లు) అందుబాటులో ఉంచండి.
3. ఆన్లైన్ తరగతులపై ఎక్కువ ఆధారపడటాన్ని తగ్గించండి. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య సంభాషణల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన పాఠ్యపుస్తకాలు మరియు ఇతర పుస్తకాల ద్వారా తక్కువ -సాంకేతిక మాధ్యమాల వాడకాన్ని ప్రోత్సహించండి.
4. 45 రోజుల వేగవంతమైన అభ్యాస పాఠ్యాంశాలను రూపకల్పన చేసి పంపిణీ చేయడం ద్వారా కోల్పోయిన బోధనా సమయాన్ని తిరిగి పొందేలా చూడాలి.
Published by: Santhosh Kumar S
First published: September 15, 2020, 4:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading