HOME »NEWS »JOBS & EDUCATION »manuu recruitment 2020 maulana azad national urdu university hyderabad extends last date for 53 posts till may 29 ss

Jobs: మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో 53 జాబ్స్... ఖాళీల వివరాలివే

Jobs: మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో 53 జాబ్స్... ఖాళీల వివరాలివే
Jobs: మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో 53 జాబ్స్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

MANUU Recruitment 2020 | హైదరాబాద్‌లోని ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పెంచారు. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గల మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ-MANUU ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసన సంగతి తెలిసిందే. వేర్వేరు డిపార్ట్‌మెంట్స్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఉర్దూ విశ్వవిద్యాలయం. మొత్తం 53 పోస్టులున్నాయి. దరఖాస్తు చేయడానికి మార్చి 27 చివరి తేదీ అని మొదట నోటిఫికేషన్‌లో ఉంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఏప్రిల్ 15 వరకు తేదీ పొడిగించారు. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో దరఖాస్తు గడువు మరోసారి పొడిగించింది విశ్వవిద్యాలయం. ఆసక్తి గల అభ్యర్థులు 2020 మే 29 వరకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ఫామ్‌ను http://manuu.ac.in/ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాలి.

    MANUU Recruitment 2020: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 53


    ప్రొఫెసర్- 10
    అసోసియేట్ ప్రొఫెసర్- 14
    అసిస్టెంట్ ప్రొఫెసర్- 10
    హెచ్ఓడీ ఆఫ్ పాలిటెక్నిక్- 2
    నాన్ టీచింగ్- 17

    MANUU Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 20
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 29
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    Deputy Registrar (Establishment & Recruitment-I),
    Room No.110 (1st Floor) Administrative Block,
    Maulana Azad National Urdu University,
    Urdu University Road, Gachibowli,
    Hyderabad - 500 032 (Telangana)

    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Andhra Pradesh Jobs: కరోనా వైరస్ ఆస్పత్రుల్లో 146 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    HPCL Jobs: హెచ్‌పీసీఎల్ సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు

    Jobs: పీజీ పాసైనవారికి 150 పోస్టులు... నేటి నుంచి దరఖాస్తులు
    Published by:Santhosh Kumar S
    First published:April 29, 2020, 12:12 IST

    टॉप स्टोरीज