Jobs in HSSC: హెచ్‌ఎస్‌ఎస్‌సీలో మేనేజ‌ర్ ఉద్యోగాలు

(ప్రతీకాత్మక చిత్రం)

హైడ్రోకార్బన్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌(హెచ్‌ఎస్‌ఎస్‌సీ)లో మేనేజ‌ర్, ఎగ్జక్యూటీవ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

  • Share this:
    హైడ్రోకార్బన్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌(హెచ్‌ఎస్‌ఎస్‌సీ)లో మేనేజ‌ర్, ఎగ్జక్యూటీవ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ ఆధ్వ‌ర్యంలో ఈ సంస్థ న‌డుస్తోంది. స్టాండర్డ్స్‌ అండ్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌(క్యూఏ), ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్‌ అస్సెస్సర్స్, కరిక్యులమ్‌/కంటెంట్‌ డెవలప్‌మెంట్, అఫిలియేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ డెలివరీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
    అర్హ‌త‌లు..
    సంబంధిత రంగాల్లో ప‌ని అనుభ‌వంతో పాటు కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్స్‌/మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ /మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పీజీ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి.
    వ‌య‌సు - 35 నుంచి 40 ఏళ్లు మ‌ధ్య ఉండాలి. ఈ-మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు పంపాలి.
    ద‌ర‌ఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్ : hr@hsscindia.in
    పోస్టుల వివ‌రాలు..
    మొత్త పోస్టులు - 16
    మేనేజర్‌–05,
    అసిస్టెంట్‌ మేనేజర్‌–05,
    ఎగ్జిక్యూటివ్‌–06.

    దరఖాస్తులకు చివరి తేది: 26.08.2021
    వెబ్‌కోసం క్లిక్ చేయండి
    Published by:Sharath Chandra
    First published: