• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • MAN ATTACHED RESUME IN DOUGHNUT BOX TO SEND EMPLOYER PHOTO BECAME VIRAL NS GH

Tasty Resume: ఇది కడుపులోకి వెళ్లే రెజ్యుమే.. వైరల్ అవుతున్న వింత ఐడియా.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

Tasty Resume: ఇది కడుపులోకి వెళ్లే రెజ్యుమే.. వైరల్ అవుతున్న వింత ఐడియా.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగానికి తొలి మెట్టుగా నిలిచే రెజ్యూమెను ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు అంతా కుస్తీ పడుతుంటారు. అయితే, ఒక అభ్యర్థి మాత్రం జాబ్​ కొట్టేందుకు వినూత్న పంథాను ఎంచుకున్నాడు.

  • Share this:
ఉద్యోగ వేట అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక్క జాబ్​ కోసం వందల మంది పోటీ పడే రోజులివి. అందువల్లే.. ఇంటర్వ్యూ చేసే వారిని అట్రాక్ట్​ చేయడానికి ఎన్నో ఎత్తులు వేస్తుంటారు అభ్యర్థులు. కొందరు తమ టాలెంట్​తో ఆకట్టుకుంటే, మరికొందరు వారి మాటలతో ఆకట్టుకొని జాబ్​ సాధిస్తారు. అయితే, ఉద్యోగం​ సాధించాలంటే మొదటగా రెజ్యూమె​ కీలక పాత్ర పోషిస్తుంది. రెజ్యూమె​ ద్వారానే మీ గురించి సంక్షిప్తంగా ఆ సంస్థకు తెలుస్తుంది. మీ విద్యార్హతలు, నైపుణ్యాలు వారి సంస్థలోని ఉద్యోగానికి తగిన విధంగా ఉంటే అప్పుడు మిమ్మల్ని షార్ట్​లిస్ట్ చేసి ఇంటర్వూకి పిలుస్తారు. అక్కడ మీ టాలెంట్​ను నిరూపించుకుంటేనే ఉద్యోగం దక్కుతుంది. ఈ ప్రక్రియలో ఉద్యోగానికి తొలి మెట్టుగా నిలిచే రెజ్యూమెను ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు అంతా కుస్తీ పడుతుంటారు. అయితే, ఒక అభ్యర్థి మాత్రం జాబ్​ కొట్టేందుకు వినూత్న పంథాను ఎంచుకున్నాడు. తన రెజ్యూమె​ను ఒక డోనట్​ బాక్స్​లో పెట్టి పంపించాడు. దాని ద్వారా ఇంటర్వూ చేసే వారిని అట్రాక్ట్​ చేయడానికి ప్రయత్నించాడు.

దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ రెడిట్ లో పోస్ట్​ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పోస్ట్​ను పరిశీలించగా.. నాలుగు డోనట్స్ తో కూడిన ఒక బాక్స్​లో అతని రెజ్యూమెను చూడవచ్చు. అయితే, ఆ రెజ్యూమె తో పాటు అందులో ఒక సందేశాన్ని కూడా జతచేశాడు. “చాలా మంది రెజ్యూమె​లు చివరికి చేరేది చెత్త బుట్టకి. కానీ నా రెజ్యుమె మాత్రం చివరికి మీ పొట్టలోకి చేరుతుంది.” అంటూ కామెంట్​ జత చేశాడు.

ఫిబ్రవరి 21న సోషల్​ మీడియాలో దీన్ని పోస్ట్ చేయగా.. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.​ ఈ పోస్ట్​కు 65,700 లైక్​లు, వేలకొద్ది కామెంట్లు వచ్చి పడుతున్నాయి. అయితే, నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు అతడు తెలివైన పని చేశాడని కామెంట్​ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలా చేయడం వల్ల జాబ్​ రాదని.. టాలెంట్​తో జాబ్​ కొట్టాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ రెజ్యుమె పోస్ట్ వైరల్ అయిన తర్వాత చాలా సంస్థలు అతడిని ఇంటర్వ్యూకి పిలిచాయట. అందులో ఏ సంస్థ తన టాలెంట్ కి తగిన జీతం ఇస్తే అందులో చేరతాను అంటున్నాడు ఆ వ్యక్తి.
Guy disguises his resume as a donut box to get better chances from r/pics


ఫన్నీగా స్పందిస్తున్న నెటిజన్లు..
అతడు పంపిన రెజ్యూమె​పై కంపెనీ స్పందించే తీరుపై ఒక నెటిజన్​.. "మీరు డోనట్ బాక్స్​ పంపినందుకు ధన్యవాదాలు, కానీ మీరు మా అధికారిక వెబ్‌సైట్ ద్వారానే ఈ జాబ్​కు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే, మా రిక్రూట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ఉంటారు. దాని ద్వారానే మీ దరఖాస్తును పరిశీలిస్తాం." అంటూ ఫన్నీగా కామెంట్​ పెట్టాడు. మరో నెటిజన్​ "మార్కెటింగ్ లేదా సేల్స్​ ఉద్యోగాలకైతే ఇటువంటి కాన్సెప్ట్​ పని చేయవచ్చు." అని కామెంట్​ చేశాడు. ఇంతకీ తను ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు? గూఢాచారి లేదా డిటెక్టివ్? పోస్టుకేనా? అంటూ మరో నెటిజన్​ ఫన్నీ కామెంట్​ చేశాడు.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు