మీరు బీటెక్ చేయాలనుకుంటున్నారా? ఇంజనీరింగ్ డిగ్రీ మీ కలా? ప్రముఖ ఇంటర్నేషనల్ టెక్నాలజీ స్కూల్ మహీంద్రా ఎకోల్ సెంట్రల్-MEC, హైదరాబాద్ బీటెక్ కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. 2020-2024 విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ కౌన్సిలింగ్ జరగనుంది. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా బీటెక్ అడ్మిషన్ల కోసం ఆన్లైన్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు https://www.mahindraecolecentrale.edu.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి మే 10 చివరి తేదీ. సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లకు కౌన్సిలింగ్ జరగనుంది.
B tech Counselling: కౌన్సిలింగ్ వివరాలు ఇవే...
మొత్తం సీట్లు- 240
సివిల్- 60
మెకానికల్- 60
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 60
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 60
B tech Counselling: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 10
విద్యార్హతలు- 60 శాతం మార్కులతో 10+2 పాస్ కావాలి. జేఈఈ మెయిన్స్ క్వాలిఫై కావాలి.
ఎంపిక విధానం- 2020 జనవరిలో జేఈఈ మెయిన్స్ పర్సెంటైల్ ఆధారంగా అడ్మిషన్లకు ఎంపిక చేస్తారు.
బీటెక్ కౌన్సిలింగ్కు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.