హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Agniveer Womens: అగ్నివీర్ పోస్టులకు భారీగా దరఖాస్తులు చేసుకున్న మహిళలు.. ఆశ్చర్యపోతున్న అధికారులు..

Agniveer Womens: అగ్నివీర్ పోస్టులకు భారీగా దరఖాస్తులు చేసుకున్న మహిళలు.. ఆశ్చర్యపోతున్న అధికారులు..

Agniveer Womens: అగ్నివీర్ పోస్టులకు భారీగా దరఖాస్తులు చేసుకున్న మహిళలు.. ఆశ్చర్యపోతున్న అధికారులు..

Agniveer Womens: అగ్నివీర్ పోస్టులకు భారీగా దరఖాస్తులు చేసుకున్న మహిళలు.. ఆశ్చర్యపోతున్న అధికారులు..

మహిళలు(Momens) కూడా పురుషులతో సమానంగా ఉండాలని.. పలు రిజర్వేషన్లను రాజ్యాంగం ప్రకారం స్త్రీలకు కల్పించారు. పని చేస్తున్న ప్రదేశంలో కూడా అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాజ్యంగంలోని ఆదేశిక సూత్రాల్లో(Direct Principles) పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

మహిళలు(Momens) కూడా పురుషులతో సమానంగా ఉండాలని.. పలు రిజర్వేషన్లను రాజ్యాంగం ప్రకారం స్త్రీలకు కల్పించారు. పని చేస్తున్న ప్రదేశంలో కూడా అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాజ్యంగంలోని ఆదేశిక సూత్రాల్లో(Direct Principles) పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రతీ రంగంలో దూసుకొస్తున్న మహిళలు మిలటరీ(Militory) వంటి వాటిల్లో ఎక్కువ అవకాశాలు ఉండేవి కావు. వాటిలో పని చేసేందుకు కూడా మహిళలు అంత ఆసక్తి చూపించేవారు కాదు. తాజాగా కేంద్ర ప్రభుత్తవం అగ్నివీర్ లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం మహిళలకు కూడా అవకాశం కల్పించారు. దీంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి మహిళలు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ నుండి పెద్ద సంఖ్యలో అమ్మాయిలు మిలటరీ పోలీస్‌లో రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Language War: SSC CGL ఎగ్జామ్‌ను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి.. కన్నడ భాషా సంఘాల ఆందోళన..

అగ్నివీర్‌ సోల్జర్‌ జీడీగా మారేందుకు బాలికలు ఆన్‌లైన్‌లో 81 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంగా దరఖాస్తులు వస్తామని తాము ఊహించలేదని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ దరఖాస్తులను త్వరలో పరిశీలించనున్నారు. అకడమిక్  మార్కులు అధికంగా ఉన్న ఉన్న మహిళల ఆధారంగా కట్-ఆఫ్ తయారు చేయబడుతుంది. ఇది త్వరలో ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడుతుంది. దీంతో పాటు, ఆర్మీ రిక్రూట్‌మెంట్ అడ్మిట్ కార్డ్‌లు కూడా త్వరలో అప్‌లోడ్ చేయబడతాయి.

మిలిటరీ పోలీస్‌లో రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను 9 ఆగస్టు నుండి 7 సెప్టెంబర్ 2022 వరకు ఆహ్వానించారు. ఇందులో ఉత్తరాఖండ్‌కు చెందిన బాలికలు యూపీలో నమోదు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ కు సంబంధించి సమాచారం కొరకు joinindianarmy.nic.in ని సందర్శించాలి . వీటికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.

Top 10 Skills To Get Job: ఉద్యోగ సాధనలో ఉపయోగపడే టాప్ 10 నైపుణ్యాలు ఇవే.. నివేదిక విడుదల చేసిన లింక్డ్‌ఇన్ ..

ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా.. ఈ పోస్టులకు 81 వేల మంది బాలికలు దరఖాస్తు చేసుకోవడంతో ఇప్పుడు టర్న్ ర్యాలీ నిర్వహించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ హెడ్ క్వార్టర్ UP మరియు ఉత్తరాఖండ్ తరపున కంటోన్మెంట్‌లోని AMC స్టేడియంలో 30 నవంబర్ నుండి 10 డిసెంబర్ 2022 వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది.

Bank Jobs 2022: IDBI, SBI, NABARD పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి.. ఆ వివరాలిలా.. 

అంతకుముందు దేశవ్యాప్తంగా మిలటరీ పోలీస్‌లో 100 పోస్టులకు రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించారు. గత రిక్రూట్‌మెంట్ సమయంలో 80 వేల మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నందున, రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు 10వ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన 5,898 మంది బాలికలకు మాత్రమే అడ్మిట్ కార్డులు జారీ చేయబడ్డాయి. ఈసారి 81,169 ఆన్‌లైన్ దరఖాస్తులు జరిగాయి. వారి మార్కుల ఆధారంగా కటాఫ్‌ను సిద్ధం చేస్తారు.

Published by:Veera Babu
First published:

Tags: Agniveer, Career and Courses, JOBS

ఉత్తమ కథలు