హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In Telangana: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్.. బీటెక్ అభ్యర్థులు అర్హులు..

Jobs In Telangana: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్.. బీటెక్ అభ్యర్థులు అర్హులు..

Jobs In Telangana: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్.. బీటెక్ అభ్యర్థులు అర్హులు..

Jobs In Telangana: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్.. బీటెక్ అభ్యర్థులు అర్హులు..

Jobs In Telangana: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. నల్గొండలోని మహాత్మా గాంధీ వర్సిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో మరో నోటిఫికేషన్(Notification) విడుదల అయింది. నల్గొండలోని మహాత్మా గాంధీ వర్సిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(Technology), యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్(University College Of Commerce).. బిజినెస్ మేనేజ్మెంట్(Business Management0 లో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ పోస్టుల(Part Time Faculty Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Telangana Gurukul Posts: గురుకుల పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు.. 10 వేల పోస్టులకు ముందడుగు..!

పోస్టుల వివరాలు..

పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ..

-ప్రోగ్రామ్.. బీటెక్ ఈఈఈ, ఎంబీఏ, ఎంకాం..

అర్హతలు..

-సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంబీఏ, నెట్, స్లెట్, సెట్ లేదా పీహెచ్ డీ ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్టార్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎల్లారెడ్డి గూడెం, నల్గొండ అడ్రస్ కు పంపాలి. దరఖాస్తు ఫారమ్ నోటిఫికేషన్ లో పేర్కొన్న ఫార్మాట్ లో ఉండాలి. నోటిఫికేషన్ ను ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులను సెప్టెంబర్ 28, 2022 తేదీలోపు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు ఫారమ్ తో పాటు.. విద్యార్హత సర్టిఫికెట్లను జతచేసి పైన పేర్కన్న అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://mguniversity.ac.inను సందర్శించి తెలుసుకోవచ్చు.

పోస్టల్ ఉద్యోగాలు..

ఇండియా పోస్ట్‌లోఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు సువర్ణావకాశం ఉంది. తాజాగా ఇండియా పోస్ట్ లో పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Indian Post Job Notification) విడుదల చేశారు. బెంగళూరు సర్కిల్‌లోని మోటార్ మెయిల్ సర్వీస్ కింద డ్రైవర్ పోస్టుల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులను indiapost.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 26ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.19 వేల వేతనం చెల్లించనున్నారు.

Telangana Jobs: అభ్యర్థుల ఆందోళనతో.. తెలంగాణలో మరో రిక్రూట్ మెంట్ రద్దు..

అభ్యర్థులకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్‌ ఉండాలి. తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ ను https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/IP_30082022_MMS_Eng.pdf ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ దరఖాస్తు ఫామ్ లో సూచించిన వివరాలను నమోదు చేయాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను సంబంధిత పత్రాలతో జత చేసి “ది మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు-560001” చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Jobs in telangana, Telangana jobs

ఉత్తమ కథలు