Home /News /jobs /

MAHATMA GANDHI 150TH BIRTH ANNIVERSARY CENTRAL BOARD OF SECONDARY EDUCATION CBSE ASKED SCHOOLS TO OBSERVE KHADI WEARING DAY ONCE IN A MONTH SS

Gandhi Jayanthi: స్కూల్‌లో నెలకు ఓ రోజు ఖాదీ డ్రెస్... పాఠశాలల్ని కోరిన సీబీఎస్ఈ

Gandhi Jayanthi: స్కూల్‌లో నెలకు ఓ రోజు ఖాదీ డ్రెస్... పాఠశాలల్ని కోరిన సీబీఎస్ఈ
(image: PTI)

Gandhi Jayanthi: స్కూల్‌లో నెలకు ఓ రోజు ఖాదీ డ్రెస్... పాఠశాలల్ని కోరిన సీబీఎస్ఈ (image: PTI)

Mahatma Gandhi 150th Birth Anniversary | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకల్లాంటి సందర్భాల్లో ఖాదీ దుస్తుల్ని ప్రమోట్ చేస్తుంటారు. ఇప్పుడు మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఖాదీ దుస్తుల్ని ప్రోత్సహించేలా సీబీఎస్ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఇంకా చదవండి ...
    మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లల్లో నెలకు కనీసం ఓ రోజు స్వచ్ఛందంగా ఖాధీ డ్రెస్ వేసుకొని రావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE పాఠశాలల్ని కోరింది. మనల్ని ఖాదీ తప్ప మరొకటి ఏదీ ఐక్యం చేయలేదని మహాత్మా గాంధీ చెప్పారని, గ్రామీణ భారత ప్రజల జీవనోపాధి, స్వావలంబన కోసం ఖాదీ ధరించాలని, ఖాదీని ప్రోత్సహించాలని మహాత్మా గాంధీ విజ్ఞప్తి చేసిన విషయాన్ని సీబీఎస్‌ఈ గుర్తు చేసింది. అయితే పాఠశాలల్లో ఖాదీ ధరించాలన్న ఆలోచన ప్రస్తుతానికి ఉపాధ్యాయులకు, సిబ్బందికి మాత్రమే పరిమితం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకల్లాంటి సందర్భాల్లో ఖాదీ దుస్తుల్ని ప్రమోట్ చేస్తుంటారు. ఇప్పుడు మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఖాదీ దుస్తుల్ని ప్రోత్సహించేలా సీబీఎస్ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

    మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశంలోని పాఠశాలల్లో ఖాదీ ధరించడానికి ప్రత్యేక రోజును కేటాయించాలి. స్వచ్ఛందంగా వారానికి, పక్షానికి లేదా నెలకు ఓసారి ఖాదీ ధరించాలి. పిల్లలు యూనిఫామ్ ధరిస్తారు కాబట్టి వాళ్లు ఖాదీ కర్చీఫ్‌లు తీసుకొస్తే చాలు. పిల్లలు జ్యూట్ బ్యాగ్స్ తీసుకొచ్చేలా స్కూళ్లు ప్రోత్సహించాలి.
    స్కూల్ ప్రిన్స్‌పాల్స్‌కు రాసిన లేఖలో సీబీఎస్ఈ సెక్రెటరీ అనురాగ్ ఠాకూర్


    భారతదేశానికి ఖాదీ వారసత్వ దుస్తులు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మందికి ఉపాధి అవకాశాల్ని కల్పించడం మాత్రమే కాదు, ఐక్యతను, సమానత్వాన్ని ప్రచారం చేయడానికి ఖాదీ దోహదపడుతుంది. చేతితో నేసిన దుస్తులు శరీరానికి సౌకర్యంగా ఉండటం మాత్రమే కాదు, కాలుష్యానికి కారణమైన కర్బన ఉద్గారాలనూ విడుదల చేయవు. అందుకే ఖాదీ దుస్తుల్ని పర్యావరణ హితమైనవిగా గుర్తిస్తారు.

    Mahatma Gandhi 150th Birthday: జాతిపిత అరుదైన 100 చిత్రాలు... మీరు చూశారా?



    ఇవి కూడా చదవండి:

    Samsung Galaxy Fold: ఈ స్మార్ట్‌ఫోన్ మడతపెట్టొచ్చు... ఎలా ఉందో చూడండి

    Best TVs: ఆన్‌లైన్‌లో టీవీ కొంటున్నారా? ఫెస్టివల్ సేల్‌లో 12 బెస్ట్ టీవీలు ఇవే...

    Dussehra Sale: మీకు సెల్ఫీలు ఇష్టమా? దసరా సేల్‌లో ఈ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్స్
    First published:

    Tags: CBSE, Gandhi 150th Birth Anniversary, Gandhi Jayanti, Mahatma Gandhi

    తదుపరి వార్తలు