Anganwadi Jobs: మహబూబ్‌నగర్ జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్

Anganwadi Jobs: మహబూబ్‌నగర్ జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

Anganwadi Jobs | అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి అలర్ట్. మహబూబ్‌నగర్ జిల్లాలో 164 అంగన్వాడీ పోస్టుల (Anganwadi Jobs) భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఖాళీల వివరాలతో పాటు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    మహబూబ్‌నగర్ జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల (Anganwadi Jobs) భర్తీకి డిపార్ట్‌మెంట్ ఫర్ వుమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్‌ఫేర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 164 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 27 చివరి తేదీ. మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. అప్లై చేసే అభ్యర్థులు స్థానికులై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్‌లో ఖాళీల వివరాలు, విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

    Mahabubnagar Anganwadi Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...





















    మొత్తం ఖాళీలు 164
    అంగన్వాడీ టీచర్ 29
    మినీ అంగన్వాడీ టీచర్ 12
    అంగన్వాడీ హెల్పర్ 123

    Deloitte: ఫ్రెషర్స్​కు డెలాయిట్ గుడ్​న్యూస్​... హైదరాబాద్​లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

    Mahabubnagar Anganwadi Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 27

    విద్యార్హతలు- అభ్యర్థులు 10వ తరగతి పాస్ కావాలి.

    ఇతర అర్హతలు- అభ్యర్థులు స్థానికంగా నివసిస్తున్నవారై ఉండాలి.

    వయస్సు- 21 నుంచి 35 ఏళ్లు.

    ఎంపిక విధానం- మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.

    గ్రామాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ఎంపిక విధానం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    IBPS PO Recruitment 2021: డిగ్రీ అర్హతతో 4,135 బ్యాంక్ జాబ్స్... అప్లై చేయండి ఇలా

    Mahabubnagar Anganwadi Recruitment 2021: దరఖాస్తు విధానం


    Step 1- అభ్యర్థులు https://mis.tgwdcw.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో Please Click Here to Fill your Application Form లింక్ పైన క్లిక్ చేయాలి.

    Step 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మొదటి సెక్షన్‌లో అప్లై చేసే పోస్ట్ పేరు, అంగన్వాడీ సెంటర్ వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 4- రెండో సెక్షన్‌లో అభ్యర్థి పేరు, తండ్రి పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్ ఎంటర్ చేయాలి.

    Step 5- మూడో సెక్షన్‌లో క్యాస్ట్ వివరాలు ఎంటర్ చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.

    Step 6- నాలుగో సెక్షన్‌లో ఎస్ఎస్‌సీ పాస్ అయిన సంవత్సరం, మార్కుల వివరాలు ఎంటర్ చేసి, టెన్త్ మెమో అప్‌లోడ్ చేయాలి.

    Step 7- తర్వాతి సెక్షన్‌లో ఇతర విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 8- చివరి సెక్షన్‌లో ఇతర వివరాలు సెలెక్ట్ చేసి సంబంధిత సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.

    Step 9- Preview పైన క్లిక్ చేసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

    Step 10- Submit పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published: