మహారాష్ట్రకు చెందిన స్టేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ సెల్, ఆ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో సీట్లు భర్తీ చేయడానికి వివిధ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. తాజాగా ఈ సెల్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన ఎంహెచ్ ఎంబీఏ/ ఎంఎంఎస్ సెట్(MAH MBA/MMS CET)-2023 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష మార్చి 18,19 తేదీల్లో జరగాలి. అయితే తాజాగా ఈ పరీక్ష మార్చి 25, 26 తేదీలకు రీ షెడ్యూల్ చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర స్టేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ సెల్ అధికారికంగా ఓ ప్రకటన జారీ చేసింది.
మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ కూడా ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించారు. “2023-24 అకడమిక్ ఇయర్ కి సంబంధించి స్టేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా MBA, MMS వంటి ప్రొఫెషనల్ పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పించడానికి నిర్వహించే MAH MBA/MMS CET 2023 ఎంట్రెన్స్ టెస్ట్‌ను మార్చి 18-19 కి బదులుగా మార్చి 25-26 తేదీల్లో నిర్వహించనున్నారు.’’ అని చంద్రకాంత్ ట్వీట్ చేశారు.
* హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రాసెస్ముందుగా అధికారిక పోర్టల్ cetcell.mahacet.orgను విజిట్ చేయాలి. మెయిన్ పేజీలో అందుబాటులో ఉన్న MBA/MMS 2023 హాల్ టిక్కెట్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. దీంతో MAH MBA/MMS CET 2023కు సంబంధించిన మీ హాల్ టిక్కెట్ డిస్‌ప్లే అవుతుంది. దీంతో దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. MAH MBA/MMS CET 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 23న ప్రారంభమై, మార్చి 6వ వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. అప్లికేషన్ ఎడిట్‌కు మార్చి 7, 8 తేదీల్లో అవకాశం కల్పించారు.
* ఎగ్జామ్ ప్యాట్రన్ MAH MBA/MMS CET- 2023 పేపర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఈ పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నారు. ప్రశ్నాపత్రం మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్-టైప్‌లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 2.30 గంటలుగా ఉంటుంది. పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కు సంబంధించిన మొత్తంగా 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొ ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
* 300 పైగా బి-స్కూల్స్‌లో ప్రవేశాలుఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా మహారాష్ట్రలోని 300 కంటే ఎక్కువ బిజినెస్ స్కూల్స్‌లో పీజీ కోర్సులైన ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడీఎం వంటి వాటిల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రధానంగా జేబీఐఎంఎస్, ఎస్ఐఎంఎస్ఆర్‌ఈఈ, పీయూఎంబీఏ, బాలాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మోడరన్ మేనేజ్‌మెంట్, ఐటీఎం బిజినెస్ స్కూల్ వంటి ఇన్‌స్టిట్యూట్స్ ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, Exams postponed, JOBS, Maharashtra