NIRF Ranking: దేశంలోని టాప్​100 విద్యా సంస్థలను ప్రకటించిన కేంద్రం.. వరుసగా మూడోసారి ఐఐటీ- మద్రాస్​ టాప్​ ప్లేస్​

జాతీయ ర్యాంకుల్లో టాప్ ప్లేసులో ఐఐటీ మద్రాస్ (File Photo)

ఓవరాల్​ కేటగిరీలో మొదటి ర్యాంక్ ఐఐటీ మద్రాస్​ సాధించింది. ఇంజినీరింగ్​ కేటగిరీలోనూ ఐఐటీ మద్రాస్​దే టాప్​ ప్లేస్​.

  • Share this:
దేశంలో టాప్​ 100 విద్యా సంస్థలకు (Educational Institutes) కేంద్ర విద్యాశాఖ (Educational Ministry) ర్యాంకింగ్స్​ ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ర్యాంకింగ్​ ఫ్రేమ్​వర్క్​ (ఎన్​ఐఆర్​ఎఫ్​) (NIRF) నివేదికను వర్చువల్​ విధానంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) గురువారం విడుదల చేశారు. మొత్తం ఆరు అంశాల ఆధారంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు ఈ నివేదిక ద్వారా ర్యాంకులు ప్రకటించారు. ఓవరాల్​ కేటగిరీలో మొదటి ర్యాంక్ ఐఐటీ మద్రాస్​ (IIT Madras) సాధించింది. ఇంజినీరింగ్​ కేటగిరీలోనూ ఐఐటీ మద్రాస్​దే టాప్​ ప్లేస్​. ఐఐటీ మద్రాస్​ ఈ ఘనతను సాధించడం వరుసగా ఇది మూడోసారి. ఈ ర్యాంకింగ్స్​లో​ ఐఐఎస్​సీ బెంగళూరు రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాన్ని ఐఐటీ- బాంబే నిలబెట్టుకుంది. ఈ మూడు దేశంలోని మొదటి మూడు అత్యున్నత విద్యాసంస్థలుగా నిలిచాయి.

ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్​, ఐఐటీ ఖరగ్​పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గువాహటి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ), బనారస్ హిందూ యూనివర్సిటీ (బిహెచ్‌యూ)లు తొలి పది స్థానాల్లో నిలిచాయి. యూనివర్సిటీల విభాగంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ) టాప్​ 10లో లేకపోగా.. జామియా మిలియా ఇస్లామియా (JMI), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు టాప్​ 10లో చోటు దక్కించుకున్నాయి. అయితే, గతేడాది జేఎంఐ పదవ స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకోగా, హైదరాబాద్​లోని హెచ్​సీయూ మాత్రం ఆరు నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

Ranji Trophy: బ్యాటింగ్‌లో బ్యాక్‌ఫుట్ షాట్లు నేర్పింది ఎవరు? రంజీ ట్రోఫీకి ఆ పేరు ఎలా వచ్చింది?


 * బీ స్కూల్స్‌ జాబితా..
దేశంలోనే అత్యుత్తమ మేనేజ్​మెంట్ బీ స్కూల్​గా ఐఐఎం- అహ్మదాబాద్ టాప్​ ప్లేస్​లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐఎం- బెంగళూరు, ఐఐఎం- కలకత్తా, ఐఐఎం కోజికోడ్, ఐఐటీ- ఢిల్లీ నిలిచాయి. కళాశాల కేటగిరీలో మిరాండా కళాశాల అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, లేడీ శ్రీ రామ్ కళాశాల రెండవ స్థానంలో నిలిచింది. చెన్నైలోని లయోలా కాలేజ్ మూడవ స్థానం, కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కళాశాల నాల్గవ స్థానం, రామ కృష్ణ మిషన్ వివేకానంద సెంటినరీ కళాశాల ఐదవ స్థానాలను దక్కించుకున్నాయి.


IPL 2021: అదే జరిగితే ఐపీఎల్ రెండో ఫేజ్ జరగడం కష్టమే.. ఆందోళనలో బీసీసీఐ, ఫ్రాంచైజీలు..


 అత్యున్నత మెడికల్​ కాలేజీల విభాగంలో ఎయిమ్స్-ఢిల్లీ దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఆ తరువాత పిజిఐఎంఇఆర్ చండీగఢ్, వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల చోటు దక్కించుకున్నాయి. ఈ సంవత్సరం దాదాపు 6,000 విద్యా సంస్థలు ఎన్​ఐఆర్​ఎఫ్​ ర్యాంకింగ్​లో పోటీ పడ్డాయి. అయితే, టీచింగ్​, లెర్నింగ్​, రిసోర్సెస్​, రీసెర్చ్​ అండ్​ ప్రొఫెషనల్​ ప్రాక్టీసెస్​, గ్రాడ్యుయేషన్ ఫలితాలు వంటి పారామీటర్స్​ ఆధారంగా ర్యాంకులు కేటాయించారు.

Published by:John Naveen Kora
First published: