హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Lucknow University: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై లక్నో యూనివర్సిటీ స్పెషల్ కోర్సు.. ఈ కోర్సు గురించి పూర్తి వివరాలిలా..

Lucknow University: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై లక్నో యూనివర్సిటీ స్పెషల్ కోర్సు.. ఈ కోర్సు గురించి పూర్తి వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై లక్నో యూనివర్సిటీ స్వల్పకాలిక కోర్సును అందిస్తుంది. సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ-2020 పేరుతో ఈ కోర్సు నిర్వహిస్తున్నారు.

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై లక్నో యూనివర్సిటీ(University) స్వల్పకాలిక కోర్సును అందిస్తుంది. సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్(Work Department) ఆధ్వర్యంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ(New Education Policy)-2020 పేరుతో ఈ కోర్సు నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం. కేవలం ఏడు రోజులు మాత్రమే జరిగే ఈ కోర్సు(Course) మార్చి 24 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 30న ముగుస్తుంది. ఈ కోర్సులో పాల్గొనడానికి గరిష్టంగా 40 మందికి మాత్రమే అవకాశం ఉంది. కోర్సుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను వర్సిటీ ప్రకటించింది. మార్చి 24న జాతీయ విద్యావిధానం-2020పై వివరణాత్మకంగా బోధించనున్నారు. మార్చి 25న ఉన్నత విద్యలోని సమస్యలు, సవాళ్లు.. మార్చి26న డిజిటల్, వర్చువల్ విద్యపై బోధించనున్నారు. మార్చి27న ఫీల్డ్ విజిట్ ఉంటుందని వర్సిటీ తెలిపింది.

పరిశోధన, ఆవిష్కరణల్లో నాణ్యత కోసం మల్టీడిసిప్లినరీ విధానంలో NEP 2020పై మార్చి 28న బోధించనున్నారు. డిజిటల్ వనరులు, లైబ్రరీ అంశంపై మార్చి 29న, భవిష్యత్తు ఓపెన్ సెషన్ కోసం పెట్టుబడిగా జాతీయ విద్యావిధానం-2020 ఎలా పనిచేస్తోందో షెడ్యూల్‌లో చివరి రోజైన మార్చి 30న యూనివర్సిటీ వివరించనుంది.

SIDBI recruitment 2022: రూ.70,000 వేతనంతో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్... డిగ్రీ పాసైతే చాలు

ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల కోసం లక్నో యూనివర్సిటీ తన హాస్టల్‌లో బోర్డింగ్, బస కోసం ఉచితంగా ఏర్పాట్లు చేయనుంది. అదేవిధంగా ప్రయాణ ఖర్చుల రీయింబర్స్‌మెంట్ సదుపాయాన్ని కల్పించింది. కాలేజీల్లో రిపోర్టింగ్ చేసే సమయంలో అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ హార్డ్ కాపీని తీసుకెళ్లాలని యూనివర్సిటీ సూచించింది.

సోషల్ సైన్స్‌‌లోని ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఈ షార్ట్ టర్మ్ కోర్స్ ఒక వేదికగా పనిచేస్తుందని లక్నో యూనివర్సిటీ తెలిపింది. NEP 2020 అంతర్లీన భావనను విద్యార్థులు అర్థం చేసుకోవడం కోసం, పాఠ్యాంశాల రూపకల్పన నిర్వహణపై శిక్షణను అందించడం, నాయకత్వం భావనపై దృష్టి సారించడం, విశ్లేషణాత్మక ఆలోచన, విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం కోసం ఈ కోర్సును అందిస్తున్నట్లు లక్నో యూనివర్సిటీ తెలిపింది.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)... రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెల్ (RDC) స్థాపన కోసం కొత్తగా రూపొందించిన మార్గదర్శకాలను అమలు చేయాలని ఉన్నత విద్యా సంస్థలను (HEIs) ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత విద్యాసంస్థలకు మార్చి 14న లేఖలు రాసింది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెల్ స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు జాతీయ విద్యావిధానంలో భాగంగా ఉన్నత విద్యా సంస్థలు మల్టీడిసిప్లినరీ/ట్రాన్స్‌డిసిప్లినరీ, ట్రాన్స్‌లేషన్ రీసెర్చ్ కల్చర్‌ను కచ్చితంగా కల్పించాల్సి ఉంటుందని.. ఆత్మనిర్భర్ భారత్ సాధించే దిశగా ఇది పనిచేస్తుందని యూజీసీ తెలిపింది.

Telangana Groups Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు?

వైస్-ఛాన్సలర్ లేదా ప్రిన్సిపాల్ నేతృత్వంలోని పరిశోధన సలహా మండలి ఆధ్వర్యంలో RDCలు పనిచేయనున్నాయి. పరిశోధన- సమాచారం, డేటాబేస్‌లు, ప్రచురణలు, పరిశోధన ప్రాజెక్ట్‌లు, ఫెలోషిప్, పేటెంట్లు, సహకారం, ఇన్నోవేషన్ థ్రస్ట్ ప్రాంతాలు మొదలైనవాటిని సేకరించి, నిర్వహించడానికి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (RIMS)ను ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో యూజీసీ పేర్కొంది.

First published:

Tags: Career and Courses, Lucknow, Uttarapradesh

ఉత్తమ కథలు