ముంబాయి (Mumbai)లోని ల్యాబొరేటరీస్ టెక్స్‌టైల్ కమిటీ (Laboratories Textiles Committee)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో టెక్స్‌టైల్ టెస్టింగ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థికి రూ.15,000 స్టైఫండ్ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు బెంగుళూర్ (Banglore), చెన్నై తదితర ప్రదేశాల్లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ (Inteview) ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ http://textilescommittee.nic.in/applications-post-fellow-textile-testing ను సందర్శించాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 24, 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం..
పోస్టు పేరు | టెక్స్‌టైల్ టెస్టింగ్ ఫెలో (Textile Testing Fellow) |
పోస్టుల సంఖ్య | 25 |
అర్హతలు | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఫిజిక్స్, కెమిస్ట్రీలో బీఎస్సీ చేసి ఉండాలి. లేదా టెక్స్‌టైల్ రంగంలో బీటెక్ చేసి ఉండాలి. |
స్టైఫండ్ | రూ.15,000 |
వయసు | దరఖాస్తు చేసుకోవాలనుకొన్న వ్యక్తి వయసు 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. |
కాంట్రాక్టు కాలపరిమితి | 11 నెలలు |
HAL Recruitment 2021: హెచ్ఏఎల్‌లో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. జీతం రూ.21,473
ఎంపిక విధానం..
Step 1: ఆసక్తిగల అభ్యర్థి దరఖాస్తు చేసుకోవాలి.
Step 2: అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
Step 3: ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థి సర్టిఫికెట్లు (Certificates) పరిశీలించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 : ముందగా అధికారిక వెబ్‌సైట్ http://textilescommittee.nic.in/ ను సందర్శించాలి.
Step 3 : అనంతరం Applications for the post of Fellow (Textile Testing) లింక్‌లోకి వెళ్లాలి.
Jobs in PhonePe : మ్యూచ్‌వల్ ఫండ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు.. అప్లికేషన్ ప్రాసెస్, అర్హతలు
Smart Phones: మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌లు.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే
Step 4 : అనంతరం అప్లికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు చదవాలి.
Step 5 : అర్హత ఉంటే దరఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ (Download) చేసుకోవాలి.
(అప్లికేషన్ ఫాం కోసం క్లిక్ చేయండి)
Step 6 : దరఖాస్తు ఫాంను తప్పులు లేకుండా నింపాలి.
Step 7 : ఏ రాష్ట్రానికి దరఖాస్తు చేస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందిన కార్యాలయం అడ్రస్‌కు నోటిఫికేషన్‌లో చూసుకొని పంపాలి.
Step 8 : దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 24, 2021
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021, Job notification, JOBS