Home /News /jobs /

LTC RECRUITMENT 2021 JOBS IN LTC SALARY RS 15000 AND ONLY TWO DAYS CHANCE TO APPLY EVK

LTC Recruitment 2021: ఎల్‌టీసీలో ఉద్యోగాలు.. వేతనం రూ.15,000.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే చాన్స్‌!

ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీలో ఉద్యోగాలు

ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీలో ఉద్యోగాలు

LTC Recruitment 2021 : ముంబాయి (Mumbai)లోని ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీ (Laboratories Textiles Committee)లో ప‌లు పోస్టుల భ‌ర్తీ ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తుంది. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు రూ.15,000 వేతనం అందిస్తారు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 24, 2021 వ‌ర‌కు అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
    ముంబాయి (Mumbai)లోని ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీ (Laboratories Textiles Committee)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో టెక్స్‌టైల్ టెస్టింగ్ ఫెలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు ఆఫ్‌లైన్  ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థికి రూ.15,000 స్టైఫండ్ ఇస్తారు. ఎంపికైన అభ్య‌ర్థులు బెంగుళూర్‌ (Banglore), చెన్నై త‌దిత‌ర ప్ర‌దేశాల్లో ప‌ని చేయాల్సి ఉంటుంది. అభ్య‌ర్థుల‌ను ఎటువంటి ప‌రీక్ష లేకుండా కేవలం ఇంట‌ర్వ్యూ (Inteview) ద్వారా మాత్ర‌మే ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు విధానం, నోటిఫికేష‌న్ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ http://textilescommittee.nic.in/applications-post-fellow-textile-testing ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు డిసెంబ‌ర్ 24, 2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

    ముఖ్య‌మైన స‌మాచారం..



























    పోస్టు పేరుటెక్స్‌టైల్ టెస్టింగ్ ఫెలో (Textile Testing Fellow)
    పోస్టుల సంఖ్య25
    అర్హ‌త‌లుగుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీలో బీఎస్సీ చేసి ఉండాలి. లేదా టెక్స్‌టైల్ రంగంలో బీటెక్ చేసి ఉండాలి.
    స్టైఫండ్రూ.15,000
    వ‌య‌సుద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకొన్న వ్య‌క్తి వ‌య‌సు 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
    కాంట్రాక్టు కాల‌ప‌రిమితి11 నెల‌లు

    Work From Home: ఆఫీసుకు రావాల‌నుకోవ‌డం లేదు.. "వ‌ర్క్ ఫ్రం హోం"కు అల‌వాటు ప‌డ్డ ఉద్యోగులు


    ఎంపిక విధానం..

    Step 1: ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 2: అభ్య‌ర్థుల మెరిట్ ఆధారంగా ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు.

    AIIMS Recruitment 2021: ఎయిమ్స్‌లో 118 ఉద్యోగాలు.. అర్హ‌త‌, వేత‌నం.. ద‌ర‌ఖాస్తు విధానం


    Step 3: ఇంట‌ర్వ్యూలో ఎంపికైన అభ్య‌ర్థి స‌ర్టిఫికెట్లు (Certificates) ప‌రిశీలించి తుది ఎంపిక చేస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 2 :  ముంద‌గా అధికారిక వెబ్‌సైట్ http://textilescommittee.nic.in/ ను సంద‌ర్శించాలి.

    Step 3 :  అనంత‌రం Applications for the post of Fellow (Textile Testing) లింక్‌లోకి వెళ్లాలి.

    ESIC Recruitment 2021: ఈఎస్ఐసీలో 1,120 ఉద్యోగాలు.. జీతం రూ.56,100.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌


    Cyber Crime: మీ ఫోన్‌కు ఈ మెసేజ్ వ‌చ్చిందా.. అయితే జాగ్ర‌త్త.. వెంట‌నే డెలిట్ చేయండి!


    Step 4 :  అనంత‌రం అప్లికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు చ‌ద‌వాలి.

    Step 5 :  అర్హ‌త ఉంటే ద‌ర‌ఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ (Download) చేసుకోవాలి.
    (అప్లికేష‌న్ ఫాం కోసం క్లిక్ చేయండి)

    Step 6 :  ద‌ర‌ఖాస్తు ఫాంను త‌ప్పులు లేకుండా నింపాలి.

    Step 7 :  ఏ రాష్ట్రానికి ద‌ర‌ఖాస్తు చేస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందిన కార్యాల‌యం అడ్ర‌స్‌కు నోటిఫికేష‌న్‌లో చూసుకొని పంపాలి.

    Step 8 :  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 24, 2021
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2021, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు