LT INFOTECH TO HIRE 3800 FRESHERS IN THIS FISCAL KNOW DETAILS SS
L&T Jobs: ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్లో 3,800 ఫ్రెషర్స్‌కి అవకాశాలు
ప్రతీకాత్మక చిత్రం
L&T Infotech Jobs | మార్చి 2019 నాటికి ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ 4,000 మందికి పైగా ఉద్యోగుల్ని నియమించుకుంది. వారిలో 656 మందిని నాలుగో త్రైమాసికంలో నియమించుకుంది.
మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? సాఫ్ట్వేర్ కోర్సులు చేస్తున్నారా? మీకు శుభవార్త. ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. ఇంజనీరింగ్ రంగ దిగ్గజానికి చెందిన సాఫ్ట్వేర్ సంస్థ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ త్వరలో 3,800 మంది ఫ్రెషర్స్‌ని నియమించుకోనుందని కంపెనీకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. కంపెనీ అవసరాలు పెరుగుతున్నందున కొత్తవారిని నియమించుకోవాలని అనుకుంటున్నామని చెప్పారాయన. మార్చి 2019 నాటికి ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ 4,000 మందికి పైగా ఉద్యోగుల్ని నియమించుకుంది. వారిలో 656 మందిని నాలుగో త్రైమాసికంలో నియమించుకుంది.
మేము ఈ ఆర్థిక సంవత్సరంలో 3,700-3,800 ఫ్రెషర్స్‌ని నియమించుకోనున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 3,000 మంది ఫ్రెషర్స్‌ని నియమించుకున్నాం. జస్ట్ ఇన్ టైమ్ పద్ధతిలో నియామకాలు ఉంటాయి కాబట్టి అందుకు తగ్గ టాలెంట్ ఉన్న ఉద్యోగులు దొరకడం సవాలుగా మారింది.
— సంజయ్ జలోనా, చీఫ్ ఎగ్జిక్యూటీవ్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ నాలుగో త్రైమాసికంలో నికర ఆదాయం 31 శాతం అంటే రూ.378.5 కోట్లు పెరిగింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో 29.3 శాతం అంటే రూ.9,445 కోట్ల రెవెన్యూ పెరిగింది. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1.7 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని నాస్కామ్ లెక్క తేల్చింది. అయితే మ్యాన్‌పవర్ క్వాలిటీ విషయంలో ఇండస్ట్రీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుండటంతో అందుకు తగ్గ టాలెంట్ లేదన్న అనుమానం నిపుణుల్లో ఉంది.
Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.