వివిధ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌లు వరుసగా విడుదలవుతున్నాయి. ఇప్పుడు న్యాయ విద్యా కోర్సులపై ఆసక్తి ఉన్నవారికి లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్(LSAT) అవకాశం కల్పిస్తోంది. LSAT-india నోటిఫికేషన్ విడుదలైంది. 2023 LSAT ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవడానికి జనవరి 11వ తేదీ గడువుగా పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
LSAT-India
న్యాయ విద్యా కోర్సులు చదువాలనుకునే విద్యార్థులు లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్(LSAT) ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. పెన్సిల్వేనియా లోని లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్(LSAC) ద్వారా ఈ టెస్ట్ నిర్వహిస్తున్నారు. 2023వ సంవత్సరంలో ఈ ఎగ్జామ్ని జనవరి, జూన్ నెలల్లో రెండుసార్లు నిర్వహించనున్నారు. మొదటి విడతగా జనవరి 22న వివిధ స్లాట్ష్‌లో పరీక్ష జరుగనుంది. ఈ ఎగ్జామ్ రాయాలనుకునే అభ్యర్థులు జనవరి 11లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు దీనికి అర్హులు.
ఎగ్జామ్‌కు http://pearsonvueindia.com/lsatindia లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పరీక్షలో మొత్తం 92 ప్రశ్నలకు 2 గంటల 20 నిమిషాల్లో సమాధానాలు రాయాలి. LSAT-India ఫలితాలను పర్సంటైల్ రూపంలో వెల్లడిస్తారు.
జనవరిలో ఎగ్జామ్ మిస్ అవ్వద్దు
జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో లా అడ్మిషన్స్ డైరెక్టర్, జిందాల్ గ్లోబల్ లా స్కూల్ (JGLS) అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఆనంద్ ప్రకాష్ మిశ్రా జనవరి 22న పరీక్ష రాయడానికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలనే అంశంపై మూడు కారణాలను వివరించారు:
1. జనవరి ఎగ్జామ్‌కు హాజరైతే JGLSలో ప్రవేశం పొందే అవకాశం రెట్టింపు అవుతుంది. LSAT-India పరీక్షకు హాజరైన వారిలో సగటున 3500 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు 5-సంవత్సరాల BA/ BBA/ BComLLB హాన్స్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ పొందలేకపోతున్నారు. ఒకవేళ జనవరి పరీక్షకు హాజరై, అడ్మిషన్ కోసం కటాఫ్‌కు అర్హత సాధించలేకపోతే, 2023 జూన్ పరీక్షలో పాల్గొని అర్హత స్కోర్‌ను పొందే అవకాశం ఉంటుంది.
2.జనవరిలో జరుగుతున్న పరీక్షలో క్వాలిఫై అయితే JGLSలో సీటు దక్కుతుంది. 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ రాయకముందే సీటును పొంది తర్వాత ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా ఉత్సాహం ఉంటుంది. బోర్డ్ పరీక్షల తర్వాత సమయాన్ని మెరుగ్గా ప్లాన్ చేసుకోవచ్చు.
3. జిందాల్ గ్లోబల్ లా స్కూల్‌లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు సాధారణంగా LSAT-Indai పరీక్షలో 90 పర్సంటైల్ కట్ ఆఫ్ స్కోర్ సాధించాలి. స్కాలర్‌షిప్ కట్-ఆఫ్‌కు అర్హత సాధించడానికి రెండు పరీక్షల్లో సాధించిన స్కోర్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఇంటి నుంచి పరీక్ష రాయలనుకునే అభ్యర్థులు పరీక్ష రాయడానికి ముందే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని పరీక్షకు అనుగుణంగా వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పరీక్ష వాతావరణానికి సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవడానికి అభ్యర్థులు ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌డ్ విభాగాన్ని సందర్శించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, JOBS