దేశంలో ఉన్న లా ఇన్స్టిట్యూట్లలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం అర్హత పరీక్షగా లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్(LSAC)ను ఏటా నిర్వహిస్తారు. దీన్ని లా కోర్సులకు ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. అయితే వచ్చే ఏడాదికి సంబంధించి జనవరి, జూన్ సెషన్స్ పరీక్షల కోసం లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్(LSAC) అప్లికేషన్స్ స్వీకరిస్తోంది. అర్హులైన అభ్యర్థులు లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ అధికారిక వెబ్సైట్ Discoverlaw.in ద్వారా రిజిస్ట్రేషన్ (Registration) చేసుకోవచ్చు. జనవరి సెషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 2023 జనవరి 11 కాగా, జూన్ సెషన్‌కు 2023 మే 26గా ఉంది.
రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ప్రాసెస్..
అభ్యర్థులు ముందు LSAT అధికారిక వెబ్సైట్ Discoverlaw.in ఓపెన్ చేయాలి. ఇక్కడ హోమ్ పేజీలో కనిపించే LSAT 2023 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. తర్వాత సైన్ అప్పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
LSAT 2023 అప్లికేషన్ ఫారమ్‌ను కంప్లీట్ చేసిన తర్వాత.. అందుబాటులో ఉన్న పేమెంట్ లింక్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించండి. చివరగా అప్లికేషన్ సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
రిమోట్ ప్రొక్టార్డ్ మోడ్‌లో
లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ జనవరి-2023 సెషన్ పరీక్షను సింగిల్ సెషన్ లో రిమోట్ ప్రొక్టార్డ్ మోడ్‌లో నిర్వహించనున్నారు. ఇక జూన్ -2023 సెషన్ మాత్రం జూన్ 8, 11 తేదీల్లో రెండు స్లాట్లలో జరగనుంది. దేశంలో 20కి పైగా లా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇందులో ఐదేళ్ల LLB, మూడేళ్ల LLB, LLM ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలను లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా కల్పించనున్నారు.
మల్టిపుల్-ఛాయిస్ రూపంలో ..
LSAT -2023 పరీక్ష మూడు రకాల మల్టిపుల్-చాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. ఇందులో ప్రధానంగా అనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంచనా వేసేలా ప్రశ్నలు ఉంటాయి.
50కిపైగా టాపర్స్ స్కాలర్షిప్స్
LSAC గ్లోబల్ ఈ ఏడాది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం 50 పైగా టాపర్స్ స్కాలర్షిప్లను ప్రకటించింది. లా డిగ్రీని పొండడంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఈ స్కాలర్షిప్స్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఏదైనా LSAC గ్లోబల్ లా అలయన్స్ కాలేజీల్లో లా ప్రోగ్రాం మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజుతో పాటు బోర్డింగ్ / హాస్టల్ ఫీజులను ఈ స్కాలర్షిప్స్ కవర్ చేయనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams