ఎడ్యుకేషన్ రంగంలో ఐఐటీలు(IITs) అగ్రగామి సంస్థలుగా పేరు గడించాయి. అయితే వీటికి ఎందులోనూ తీసిపోదు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(Lovely Professional University). ప్లెస్మెంట్(Placement) రికార్డుల్లో ఐఐటీలతో పోల్చుతారు అనడంలో సందేహం లేదు. ఎల్పీయూ విద్యార్థులకు ఉద్యోగాలు(Jobs) ఇచ్చేందుకు టాప్ కంపెనీలు(Top Companies) పోటీ పడుతున్నాయి. ఈ యూనివర్సిటీ(University) 2022 ప్లేస్మెంట్ పరంగా చూస్తే గత రికార్డులను బద్దలుకొట్టింది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి అర్జున్ రూ. 62.72 లక్షల వార్షిక వేతనంతో క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఒక ఫ్రెషర్ కు ఇచ్చిన అత్యధిక వేతనం ఇదే కావడం గమనార్హం. గతేడాది అత్యధికంగా ఉన్న రూ. 42 లక్షల ప్యాకేజీ కంటే 1.5 రెట్లు ఎక్కువ ప్యాకేజీ సొంతం చేసుకోవడం విశేషం.
ఎల్పీయూ -2022 బ్యాచ్ విద్యార్థులు పరీక్షలు రాయకముందే 8400 ప్లేస్మెంట్, ఇంటర్న్‌షిప్ ఆఫర్లను సొంతం చేసుకున్నారు. దిగ్గజ కంపెనీలు అమెజాన్ రూ.46.4 లక్షల ప్యాకేజీ, గూగుల్ రూ.48 లక్షల ప్యాకేజీతో ఎల్పీయూ విద్యార్థులను ఎంపిక చేసుకుంది. ఈ ఏడాది 1190 కంటే ఎక్కువ కంపెనీలు విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి LPU క్యాంపస్‌ను సందర్శించాయి.
ఎల్పీయూలోని చాలా మంది విద్యార్థులు VMware, Lowe's, Infineon, Target వంటి టాప్ ఇంటర్నేషనల్ కంపెనీలలో 10 నుండి 48 లక్షల రూపాయల ప్యాకేజీతో ప్లేస్మెంట్ సాధించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ 670 మంది ఎల్పీయూ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంది. ఇక క్యాప్‌జెమినీ, విప్రో 310 మంది చొప్పున, ఎంఫాసిస్ 210, యాక్సెంచర్ 150 మంది విద్యార్థులు ఎంపిక చేసుకుంది.
ఈ సందర్భంగా ఎల్పీయూ ఛాన్సలర్ డాక్టర్ అశోక్ మిట్టల్ స్పందిస్తూ... విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సమగ్రమైన పాఠ్యాంశాలను అందిస్తున్నామని చెప్పారు. ఇటీవల ఇంజనీరింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్, డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్షియల్ మార్కెట్లు, సప్లై చైన్, HRM, మెడికల్ సైన్సెస్‌లలో ప్రత్యేక ప్రోగ్రామ్‌లను అందించడానికి అనేక కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పరిశ్రమ 4.0 అవసరాలకు సిద్ధంగా ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడంలో ఎల్పీయూ నిబద్ధతతో వ్యవహరిస్తోందని అశోక్ మిట్టల్ వ్యాఖ్యానించారు. తాజా గ్లోబల్ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్‌లో అతి కొద్ది భారతీయ యూనివర్సిటీల్లో ఎల్పీయూ ఒకటిగా ఉండడం చాలా గర్వంగా ఉందన్నారు.
కాగా, ఎల్పీయూ పూర్వ విద్యార్థులు ప్రపంచంలో సిలికాన్ వ్యాలీ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ తోపాటు ఇతర అగ్రశ్రేణి కంపెనీల్లో కోటి రూపాయల ప్యాకేజీతో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారని వర్సిటీ తెలిపింది. గత కొన్నేళ్ల నుంచి టాప్ రిక్రూటర్ల ద్వారా 20,000 కంటే ఎక్కువ ప్లేస్మెంట్లు, ఇంటర్న్‌షిప్‌లను LPU విద్యార్థులు సొంతం చేసుకున్నారని, ఫార్చ్యూన్ 500 కంపెనీలు అనుకున్న దాని కంటే అదనంగా మరో 5000 ఆఫర్లను ప్రకటించాయని ఎల్పీ యూనివర్సిటీ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IT jobs, JOBS, Placement