సరైన కెరీర్‌ను ఎంచుకునే విషయంలో విద్యార్థులకు సాయపడుతోంది న్యూస్18 నెట్‌వర్క్. ఎలాంటి కెరీర్ (Career)ను ఎంచుకుంటే ఫ్యూచర్‌లో సక్సెస్ (Success) అవుతారనే విషయాలపై సందేహాలు ఉన్న విద్యార్థులు @News18dotcom అనే ట్విట్టర్ (Twitter) హ్యాండిల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ వారం ఎడిషన్‌లో మెడికల్ కోడింగ్ (Medical Coding) కెరీర్ గురించి తెలుసుకుందాం.
కరోనా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలోపేతం చేయడాలని కేంద్రం నిర్ణయించింది. ఇది ప్రభుత్వ విధానాలు, డేటా నిర్వహణ, మెడికల్‌కోడ్‌లు, చెల్లింపు విధానాలలో ప్రావీణ్యం ఉన్న ఉద్యోగాలకు డిమాండ్‌ను సృష్టించింది. లాభదాయకమైన కెరీర్ ఆప్షన్‌లలో మెడికల్ కోడింగ్ కోర్సు కూడా చేరింది. ఇటీవల సంవత్సరాలలో, వైద్య, ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ భారతదేశంలో అతిపెద్ద రంగాలలో ఒకటిగా మారింది. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోని 4.7 మిలియన్ల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తోంది. వృద్ధుల సంఖ్య, టెక్నాలజీలో పురోగతి, అభివృద్ధి పరిశోధనలు ఈ పరిశ్రమ వృద్ధికి మరింత దారితీశాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే యువకులకు అనేక అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మెడికల్ కోడింగ్.
* మెడికల్ కోడర్ ఏం చేయాలి?
రోగి వివరాలను ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌లలోకి మార్చడమే మెడికల్ కోడర్ పని. మెడికల్ కోడింగ్ స్పెషలిస్ట్ కావడానికి సంబంధిత నైపుణ్యాలలో కోర్సులు, శిక్షణ తీసుకోవాలి. మెడికల్ కోడింగ్ అనేది ఆరోగ్య సంరక్షణ రంగంలోని చాలా విషయాలతో ముడిపడి ఉంటుంది. వైద్య విధానాలు, వైద్య పరిభాష, చికిత్సలు, డాక్యుమెంటేషన్ విధానాలు వంటి అంశాలపై అవగాహన అవసరం. మెడికల్ కోడర్‌లకు మానవ శరీరం గురించి మంచి అవగాహన ఉండాలి. అందుకు అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం), ఫిజియాలజీ (శరీరధర్మ శాస్త్రం) చదవాల్సి ఉంటుంది. లీగల్ కాన్సెప్ట్‌లు, ఫ్రాడ్, కాన్ఫిడెన్షియాలిటీ వంటి అంశాలపై కూడా నాలెడ్జ్ అవసరం.
భారతదేశంలో మెడికల్ కోడర్‌లు మూడు రకాల రోగనిర్ధారణ కోడ్‌లను ఉపయోగిస్తారు. అవి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్(ICD-10-CM), కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ(CPT), హెల్త్ కేర్ ప్రొసిడ్యూరల్ కోడింగ్ సిస్టమ్(HCPCS). వీటి ద్వారా రోగ నిర్ధారణలకు కోడ్‌లను, ప్రొసీజర్స్ కేటాయిస్తారు. కోర్సు పాఠ్యప్రణాళిక తప్పనిసరిగా శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు, గర్భం, పునరుత్పత్తి వ్యవస్థ, రేడియాలజీ, పాథాలజీ, వైద్యం వంటి అనేక డొమైన్‌లలో కోడింగ్‌ను అందించాలి. సాఫ్ట్‌స్కిల్స్‌పై కూడా విద్యార్థులు పట్టు సాధించాలి.
* మెడికల్ కోడింగ్ పరిశ్రమలో అవకాశాలు
మెడికల్ కోడింగ్ అనేది ఆరోగ్య సంరక్షణ అడ్మినిస్ట్రేషన్ పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న విభాగం. ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌లలో మెడికల్ కోడింగ్‌కు ఆదరణ పెరిగింది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మెడికల్ కోడర్‌లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. మోర్డోర్ ఇంటెలిజెన్స్ పరిశోధన నివేదిక ప్రకారం.. మెడికల్ కోడింగ్ కోసం ప్రపంచ మార్కెట్ 2027 నాటికి 10.93% CAGR వద్ద 28363 మిలియన్ డాలర్‌లకు చేరుతుందని అంచనా. దక్షిణాసియా-పసిఫిక్ ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అని పేర్కొంది.
మెడికల్ కోడింగ్ కోర్సు ఒక సమగ్ర విధానాన్ని అనుసరిస్తుంది. ప్రాక్టికల్ శిక్షణతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ఇన్సూరెన్స్ ఏజెన్సీలు, ప్రభుత్వ విభాగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మెడికల్ కోడింగ్ నిపుణులుగా ఫ్రీలాన్సింగ్ వృత్తిని కూడా కొనసాగించవచ్చు. భారతీయ విద్యార్థులకు, మెడికల్ కోడింగ్ కోర్సు అసాధారణమైన వృద్ధి, అవకాశాలు, ఉద్యోగ భద్రతను అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Health, JOBS, Medical study