Home /News /jobs /

LOOKING FOR A NEW JOB HERE ARE THE THINGS TO LOOK FOR WHEN SELECTING YOURS FOR A GOOD RESUME OR CV GH VB

Good CV: కొత్త జాబ్ కోసం చూస్తున్నారా..? మంచి రెజ్యూమ్‌ కోసం పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక మంచి CV (Curriculum vitae) లేదా రెజ్యూమ్.. రిక్రూటర్ మనస్సులో మొదటి అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. సరైన అభ్యర్థిపై పెట్టుబడి పెట్టే విషయంలో సమాచార నిర్ణయం తీసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. కాబట్టి కొత్త ఉద్యోగం కోసం చూసేవారు మంచి సీవీ‌ని తయారు చేసుకోవాలి.

ఇంకా చదవండి ...
ఉద్యోగం(Job) సంపాధించడంలో రెజ్యూమ్(Resume) కీలక పాత్ర పోషిస్తుంది. రిక్రూటర్‌లు ఉద్యోగుల నియామకం కోసం మంచి రెజ్యూమ్‌లను తనిఖీ చేయడానికి 23 గంటల సమయాన్ని వెచ్చిస్తారట. ప్రపంచంలో అత్యధిక యువత మనదగ్గరే ఉన్నా, గ్రాడ్యుయేట్లలో కేవలం 17 శాతం కంటే తక్కువ మంది మాత్రమే వెంటనే ఉపాధి పొందుతున్నారు. ఒకే జాబ్ ఆఫర్(Job Offer) కోసం సగటున 250 మంది దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. దీని బట్టి రెజ్యూమ్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక మంచి CV (Curriculum vitae) లేదా రెజ్యూమ్.. రిక్రూటర్ మనస్సులో మొదటి అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. సరైన అభ్యర్థిపై పెట్టుబడి పెట్టే విషయంలో సమాచార నిర్ణయం తీసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. కాబట్టి కొత్త ఉద్యోగం కోసం చూసేవారు మంచి సీవీ‌ని తయారు చేసుకోవాలి. మంచి సీవీ మిగిలిన వాటితో పోల్చినప్పుడు ఆ అభ్యర్థిని ప్రత్యేకంగా నిలుపుతుంది. బెస్ట్ CVని రూపొందించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని పరిశీలిద్దాం.

* బాధ్యతలను బట్టి ఫలితాలు
అభ్యర్థి గతంలో చేపట్టిన బాధ్యతల ద్వారా వచ్చిన ఫలితాలను ఎలా హైలైట్ చేస్తారన్న దానిపైనే ఓ CVని మిగిలిన వాటి కంటే ప్రత్యేకంగా చేస్తుంది. బాధ్యతలు నిర్వహించడం ప్లస్ పాయింట్ అయినా.. అభ్యర్థి ఆ బాధ్యతలకు మించి ఏమి సాధించారనే దాన్ని రూపొందించడంలో ఇది సహాయపడదు. ఆ విషయాలను రెజ్యూమ్‌లో పేర్కొనాలి. ఫలితాలు ఎల్లప్పుడూ సక్సెస్, సమస్య పరిష్కార వ్యూహాలకు మద్దతుగా ఉండాలి.

Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర.. మరో 1271 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

* కెరీర్ గ్రోత్‌ను హైలైట్ చేయడం
నిర్వహించిన ప్రతి ఉద్యోగ పాత్రలో అభ్యర్థి ఎలా ఎదిగాడు, కెరీర్ పథాన్ని ఎలా ఎంచుకున్నాడు అనే విషయాలను సీవీలో హైలైట్ చేయాలి. ఈ ప్రయాణం సహజమైన పురోగతిలా కనిపించే విధంగా చేసిన ఉద్యోగాల మధ్య లింక్‌ను సృష్టిస్తే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా అభ్యర్థి ప్రతి ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారో పేర్కొంటే మంచిది. తద్వారా గత ఉద్యోగాల నుంచి అభ్యర్థి చాలా నేర్చుకున్నాడని, అదేవిధంగా నైపుణ్యాలను మరింత విస్తరించడానికి కట్టుబడి ఉన్నారని రిక్రూటర్‌కు అవగతం అయ్యేలా ఇది సంకేతం ఇస్తుంది.

* నీట్‌గా ఉండాలి
చాలా మంది వ్యక్తులు తమ రెజ్యూమ్‌లో ఎక్కువ సమాచారాన్ని ఉంచుతారు. దీంతో అది డాక్యుమెంట్‌ను తలపిస్తుంది. దీంతో ఏ సమాచారాన్ని పొందుపర్చాలి? ఎంత మేరకు అది ఉండాలి ? అన్న దానిపై అభ్యర్థికి స్పష్టత ఉండాలి. ప్రాథమిక అంశాలకు కట్టుబడి, అంతటా సాధారణంగా మెరుగులు దిద్దితే బాగుంటుంది. వ్యాకరణం, స్పెల్లింగ్‌ల వంటి సాధారణ విషయాలు సరైనవని నిర్ధారించుకోండి.

* ఉద్యోగానికి అనుకూలంగా
యజమాని నిర్వచించిన ఉద్యోగ వివరణ ప్రకారం అభ్యర్థి CVని డ్రాఫ్ట్ చేయాలి. ఆ ఉద్యోగ పాత్రకు సరైన అభ్యర్థి తానే ఎందుకో కచ్చితంగా వివరించాలి. అలాగే అభ్యర్థులు తాము దరఖాస్తు చేస్తున్న ఉద్యోగాన్ని అర్థం చేసుకోవాలని యజమానులు కోరుకుంటున్నారు. దీంతో ఉద్యోగానికి సంబంధించిన అంశాలను వివరించడం అభ్యర్థికి అదనపు ప్రయోజనం చేకూర్చుతుంది.

Scholarships: డేటా సైన్స్‌ విద్యార్థుల కోసం స్పెషల్ స్కాలర్ షిప్స్.. ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..


* కీలక పదాల హైలైట్
ప్రతి పాత్రకు అనుకూలంగా, వినూత్నంగా అమలు చేసిన అంశాలను అభ్యర్థి పొందుపర్చాలి. తద్వారా వచ్చిన ఫలితాలతో రిక్రూటర్‌ను ఆకట్టుకోవచ్చు. అభ్యర్థి గతంలో చేసిన ఉద్యోగంలో ఏమి సాధించారో ప్రదర్శించడంలో ఇది సహాయపడుతుంది. నిర్దిష్ట కీలక పదాలను ఉపయోగించిన అభ్యర్థులను ఫిల్టర్ చేయడానికి చాలా కంపెనీలు డేటాబేస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తాయి. కాబట్టి మీరు ఉద్యోగ వివరణను స్పష్టంగా అధ్యయనం చేశారని రిక్రూటర్‌కు అర్థం అవుతుంది.

* వర్క్ ప్రాధాన్యత
పోస్ట్ కరోనా తరువాత కూడా రిక్రూటర్లు ఆఫీసు, వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించాలనుకుంటున్నారు. దీంతో ఉద్యోగులను తదనుగుణంగా నియమించుకోవాలని చూస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు తమ రెజ్యూమ్‌లో వర్క్ ప్రాధాన్యతను స్పష్టంగా పేర్కొనాలి.
Published by:Veera Babu
First published:

Tags: CAREER, Career and Courses, Resume, Work

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు