హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Internships: హెచ్ఆర్ జాబ్‌లో జాయిన్ అవ్వాలని చూస్తున్నారా... వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ అందించే బెస్ట్ పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ ఇవే

Internships: హెచ్ఆర్ జాబ్‌లో జాయిన్ అవ్వాలని చూస్తున్నారా... వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ అందించే బెస్ట్ పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ ఇవే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇండస్ట్రీలో హెచ్ఆర్ (HR)గా కెరీర్ కొనసాగించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు కొన్ని ఇంటర్న్‌షిప్స్‌కు అప్లై చేసుకోవచ్చు. మరి ప్రస్తుతం స్టైఫండ్ ఆఫర్ చేసే హెచ్ఆర్ ఇంటర్న్‌షిప్‌లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద్యోగాల (Jobs) కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఇంటర్న్‌షిప్‌ (Internship)లో చేరితే విద్యార్థులకు బాగా కలిసొస్తుంది. దాదాపు ప్రతి ఎంప్లాయర్ ముందస్తు అనుభవం ఉన్న అభ్యర్థులకు జాబ్స్ ఇస్తారు కాబట్టి, ఇంటర్న్‌షిప్‌లు ఇప్పుడు మరింత విలువైనవిగా మారాయి. ముఖ్యంగా స్టైఫండ్‌ (Stipend) ఆఫర్ చేసే ఇంటర్న్‌షిప్‌లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ తరహా ఇంటర్న్‌షిప్‌లు హెచ్ఆర్ (Human Resource) జాబ్‌లో జాయిన్ అయ్యే వారికి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండస్ట్రీలో హెచ్ఆర్ (HR)గా కెరీర్ కొనసాగించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. మరి ప్రస్తుతం స్టైఫండ్ ఆఫర్ చేసే హెచ్ఆర్ ఇంటర్న్‌షిప్‌ (HR Internships)లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

లో ఫారో షాప్ ప్రైవేట్ లిమిటెడ్ (Lo Faro Shop Private Limited)

ఇది ముంబై (Mumbai)లో ఆరు నెలల ఇంటర్న్‌షిప్. ఈ పని వ్యవధిలో పొందిన ప్రోత్సాహకాల (Incentives)ను మినహాయించి, నెలకు రూ.2,000 స్టైఫండ్‌ మీరు పొందవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్ కోసం నియామకం ఆన్‌లైన్‌లో జరుగుతుంది. కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను అందిస్తుంది. అభ్యర్థులు వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 13 చివరి తేదీ.

సాంకీ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Sankey Business Solutions)

ముంబైలోని సాంకీ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ 6 నెలల వ్యవధిలో అందుబాటులో ఉండే ఇంటర్న్‌ల కోసం వెతుకుతోంది. ఈ సంస్థ మంచి వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు స్టైఫండ్‌ను కూడా అందిస్తుంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ కూడా. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి మే 13 చివరి తేదీ.

బాల వికాస

ఇది తెలంగాణలో అభ్యర్థులకు (candidates) రూ. 6,000 స్టైఫండ్‌ని అందించే ఒక నెల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ కాదని దరఖాస్తుదారులు తెలుసుకోవాలి. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరే అభ్యర్థులు తెలంగాణలోని వరంగల్ (Warangal) నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 13 చివరి తేదీ.

స్కార్పియన్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్

ముంబైలోని స్కార్పియన్ ఎక్స్‌ప్రెస్ మూడు నెలల పాటు ముంబై ఆఫీస్ నుంచి పని చేయడానికి ఇష్టపడే అభ్యర్థుల కోసం వెతుకుతోంది. ఇది మంత్లీ రూ.15,000 స్టైఫండ్‌ను కూడా అందిస్తుంది. అభ్యర్థులు మే 13లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థికి స్పోకెన్ ఇంగ్లిష్ లో ప్రావీణ్యం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-వర్డ్ వంటి నైపుణ్యాలు ఉండాలి.

ధీ టెక్నాలజీస్ (Dhi Technologies), పుణే

ఇది ఆఫీసులో చేయాల్సిన ఆరు నెలల ఇంటర్న్‌షిప్. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులు పూణే ఆఫీసులో రిపోర్ట్ చేయాలి. మీ పనితీరు ఆధారంగా రూ.10,000 స్టైఫండ్‌‌ని పొందే అవకాశం ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 13.

డిజిప్లస్ (Digipplus)

ఈ ఇంటర్న్‌షిప్ అభ్యర్థులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తుంది. డిజిప్లస్‌కు వ్యక్తులు ఆరు నెలల పాటు అందుబాటులో ఉండాలి. అభ్యర్థులు మంత్లీ రూ.10,000 నుంచి 15,000 వరకు స్టైఫండ్‌గా పొందవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 13 చివరి తేదీ.

HCDS టెక్నాలజీస్

ఢిల్లీ, ఫరీదాబాద్, గుర్గావ్, ఇండోర్, కోల్‌కతా, పాట్నా, పూణే, ముంబై నోయిడా వంటి ఏదైనా నగరాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్న దరఖాస్తుదారుల కోసం HCDS టెక్నాలజీస్ వెతుకుతోంది. ఈ ఇంటర్న్‌షిప్ రెండు నెలల పాటు కొనసాగుతుంది. అభ్యర్థులు రూ. 18,000 వరకు మంత్లీ స్టైఫండ్‌ను అందుకుంటారు. ఈ ఇంటర్న్‌షిప్ కోసం మే 13 లోపు అప్లై చేసుకోండి.

First published:

Tags: Employees, Internship, JOBS

ఉత్తమ కథలు