కరోనా మహమ్మారి (corona pandemic) ప్రభావంతో వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. దీంతో చాలామంది ఉద్యోగాలు ఊడిపోయాయి. అయితే కాలక్రమేణా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో అన్ని వ్యాపారాలు మళ్లీ సాధారణ స్థితి (normalcy)కి చేరుకున్నాయి. దీంతో ఇండియాలో హైరింగ్ యాక్టివిటీ (hiring activity) విపరీతంగా పెరిగిపోయింది. నిర్దిష్ట ఉద్యోగాల నియామకాలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే వీటిలో 80% కొలువులు జాబ్‌పోర్టల్స్ (Job portals) ద్వారానే భర్తీ అయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఆ విధంగా జాబ్‌పోర్టల్స్ నిరుద్యోగులకు ఉద్యోగాలను చేరువ చేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఐదు జాబ్‌పోర్టల్స్ ఎలాంటి జాబ్‌నైనా కనిపెట్టేందుకు ఉద్యోగార్ధులకు ఉపయోగపడుతున్నాయి. మరి మీకు తగిన జాబ్స్ కనిపెట్టేందుకు హెల్ప్ చేసే ఈ ఉత్తమ జాబ్‌పోర్టల్స్ (Best job portals) ఏవో ఇప్పుడు చూద్దాం.
నౌకరి.కామ్ (Naukri.com)
నౌక్రీ.కామ్/నౌకరి.కామ్ ప్లాట్‌ఫామ్ రెజ్యూమ్ డేటాబేస్, లిస్టింగ్‌లు, రెస్పాన్స్ మేనేజ్మెంట్ టూల్స్‌తో సహా అనేక రకాల సేవలను అందిస్తుంది. నౌకరి.కామ్ 2017-2018లో 76,000 కార్పొరేట్ క్లయింట్లకు సేవలు అందించింది. అదే సమయంలో 4,75,000 ఉద్యోగాలు ఆఫర్ చేస్తూ 60 మిలియన్లకు పైగా సీవీలు మెయింటైన్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ సంస్థకు ఇండియాలో 42 ప్రదేశాలలో 56 కార్యాలయాలు ఉన్నాయి. దీని ద్వారా ఉద్యోగార్థులు తమకు నచ్చిన జాబ్ ని సులభంగా కనిపెట్టవచ్చు.
ఇన్‌డీడ్ (Indeed)
ఇన్‌డీడ్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జాబ్ సెర్చ్ ఇంజిన్లలో ఒకటి. ఈ జాబ్ పోర్టల్‌లో మీరు ప్రపంచవ్యాప్తంగా లభించే ఉద్యోగావకాశాలను అన్వేషించవచ్చు. ఇప్పటికే దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాలను చేజిక్కించుకునేందుకు నిరుద్యోగులు వాడుతున్నారు. కరోనా సమయంలోనూ ఈ ప్లాట్‌ఫామ్ 'కరోనావైరస్ వర్క్ టూల్స్' సాయంతో ఉపాధిని కల్పించడంలో ఉద్యోగార్థులకు సహాయం చేస్తోంది. మీరు ఈ ఆన్లైన్ ఎంప్లాయిమెంట్ మార్కెట్ప్లేస్ని ఉపయోగించి మిలియన్ల కొద్దీ ఉద్యోగాల కోసం అన్వేషించవచ్చు. అలాగే మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లవచ్చు.
మాన్స్టర్ (Monster)
మాన్స్టర్ అనేది భారతీయులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగార్ధులకు బాగా తెలిసిన వెబ్సైట్. ఇది భారతీయ రిక్రూటర్లు, నిరుద్యోగులకు సంబంధించిన విస్తృతమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దీనివల్ల ఉద్యోగార్థులు, యజమానులు ఒకరికొకరు కనెక్ట్ అవ్వడం సులభతరమవుతుంది. ది మాన్స్టర్ బోర్డ్, ఆన్లైన్ కెరీర్ సెంటర్ విలీనం అయినప్పుడు ఇది ప్రారంభమైంది.
జాబ్స్ ఫర్ హర్ (Jobs for Her)
జాబ్స్ ఫర్ హర్ అనేది మహిళలను వారి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడే జాబ్ ప్లాట్‌ఫామ్. ఇది ఉద్యోగాలు, కమ్యూనిటీ, మార్గదర్శకత్వం, రీస్కిల్లింగ్, ప్రేరణ, నెట్వర్కింగ్ అవకాశాలకు మహిళలను చేరువ చేస్తుంది. 2015లో స్థాపించిన ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 7500 కంటే ఎక్కువ సంస్థలతో 2.2 మిలియన్లకు పైగా ఉద్యోగార్ధులను లింక్ చేస్తోంది.
ఈ ప్లాట్ఫామ్లో తమ కెరీర్‌ను ప్రారంభించాలనుకునే లేదా తిరిగి ప్రారంభించాలనుకునే మహిళలకు మెంటర్షిప్ కూడా అందుబాటులో ఉంది. అదనంగా ఇందులో 500 మందికి పైగా రీస్కిల్లింగ్ భాగస్వాములు ఉన్నారు. వీరు ఉద్యోగంలోకి ప్రవేశించే ముందు/పునఃప్రవేశానికి ముందుగా మహిళలకు అప్‌స్కిల్‌లో సహాయపడతారు.
షైన్.కామ్ (Shine.com)
ఉద్యోగార్ధులు, రిక్రూటర్లను అనుసంధానించే పారదర్శక, ప్రభావవంతమైన ఆన్లైన్ పోర్టల్ గా 2008లో షైన్.కామ్ ప్రారంభమయ్యింది. షైన్.కామ్ పోర్టల్ ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డెలాయిట్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, అమెజాన్ వంటి పెద్ద సంస్థలతో సహా 8,000కు పైగా వ్యాపారాలను కలిగి ఉంది. ఇది 3 లక్షలకు పైగా ఉద్యోగాలను అందిస్తుంది. ఇందులో 4.1 కోట్ల మంది రిజిస్టర్డ్ ఉద్యోగార్ధులు ఉన్నారు. వీరందరికీ సరిపడా ఉద్యోగాలను షైన్.కామ్ ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IT jobs, Private Jobs