Home /News /jobs /

LOOKING FOR A JOB AS AN ACCOUNTANT AND CHECK OUT THE LIST OF ACCOUNTS INTERNSHIPS CURRENTLY AVAILABLE GH SRD

Accounts Internships: అకౌంట్స్ స్టూడెంట్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. బెస్ట్ స్టైఫండ్‌తో ఉద్యోగ అవకాశాలు..

Accounts Internships

Accounts Internships

Accounts Internships: ప్రతి వ్యాపారానికి అకౌంటింగ్ వెన్నెముక లాంటిది. పైగా, ఈ రంగానికి ఎల్లప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ప్రతి పరిశ్రమకు అకౌంటెంట్లు అవసరమే. ఇంతటి డిమాండ్ ఉన్న ఈ రంగంలో ఇంటర్న్‌షిప్స్‌ ఆఫర్ చేస్తున్నాయి పలు కంపెనీలు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రతి వ్యాపారానికి అకౌంటింగ్ వెన్నెముక లాంటిది. పైగా, ఈ రంగానికి ఎల్లప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ప్రతి పరిశ్రమకు అకౌంటెంట్లు అవసరమే. ఇంతటి డిమాండ్ ఉన్న ఈ రంగంలో ఇంటర్న్‌షిప్స్‌ ఆఫర్ చేస్తున్నాయి పలు కంపెనీలు. ఎక్స్‌పీరియన్స్‌తోపాటు స్టైఫండ్‌ను అందజేస్తున్నాయి. తద్వారా అకౌంట్స్ రంగంలో ఉద్యోగాలను ఈజీగా పొందడానికి అవకాశం ఉంటుంది. అవేంటో చూద్దాం.

* స్మార్ట్ సిటీ లిమిటెడ్‌- అకౌంట్స్ అసిస్టెంట్ ఇంటర్న్‌షిప్
ఈ ఇంటర్న్‌షిప్ 12 నెలల పాటు కొనసాగుతుంది. ఎంపికైన అభ్యర్థులు కేరళలోని తిరువనంతపురంలో పనిచేయాల్సి ఉంటుంది. అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌తో పాటు నెలకు రూ.10,000 స్టైఫండ్ లభిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 16 లోపు AICTE ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* స్మార్ట్ సిటీ లిమిటెడ్ (దావణగెరె)- అకౌంట్స్ ఇంటర్న్‌షిప్
స్మార్ట్ సిటీ లిమిటెడ్ కంపెనీ, కర్ణాటకలోని దావణగెరెలో మూడు నెలల పాటు అకౌంటెంట్ బాధ్యతలు చూసుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కంపెనీ నెలకు రూ.5,000 స్టైఫండ్‌ను అందించనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు AICTE ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆగస్టు 20లోపు దరఖాస్తు చేసుకోవాలి.

* బీఎమ్ జైన్ & కంపెనీ - అకౌంట్స్, ఇంటర్నల్ ఆడిట్
ఈ కంపెనీ అకౌంట్స్, ఇంటర్నల్ ఆడిట్‌పై ఆరు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ఇండోర్‌లో పనిచేయాల్సి ఉంటుంది. కంపెనీ నెలకు రూ. 3000 నుంచి రూ. 5000 మధ్య స్టైఫండ్‌ను అందజేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్న్‌షాలా సైట్ ద్వారా ఆగస్టు 25లోపు దరఖాస్తు చేసుకోవాలి.

* రామారావు గామిని- అకౌంట్స్ ఇంటర్న్‌షిప్
హైదరాబాద్‌కు చెందిన రామారావు గామిని సంస్థ ఆరు నెలల ఇటర్న్‌షిప్‌‌ను ఆఫర్ చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 - 20,000 మధ్య స్టైఫండ్‌ అందించనుంది. అర్హులైన అభ్యర్థులు ఇంటర్న్‌షాలా పోర్టల్‌లో ఆగస్టు 26లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఇది కూడా చదవండి : మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీ కోసమే ఈ కరెంట్ అఫైర్స్..

* సీ అండ్ రిక్రూట్ (ఐ) ప్రైవేట్ లిమిటెడ్‌- అకౌంట్స్ ఇంటర్న్‌షిప్
ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఆరు నెలల పాటు కొనసాగుతుంది. ఎంపికైన అభ్యర్థులు ముంబైలో పని చేయాల్సి ఉంటుంది. నెలకు రూ. 12,000 నుంచి రూ.15,000 మధ్య స్టైఫండ్ లభిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 25లోపు ఇంటర్న్‌షాలా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఇండియన్ మనీ మాస్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌- అకౌంట్స్ (ఆపరేషన్స్)
ఇది ఆరు నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. ఎంపికైన అభ్యర్థులు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది. నెలకు రూ.2,000 నుంచి రూ.4,000 మధ్య స్టైఫండ్‌ లభిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్న్‌షాలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆగస్టు 26 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, Internship, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు