హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Lok Sabha Recruitment 2021: రూ.65,000 వరకు వేతనంతో లోక్‌సభలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Lok Sabha Recruitment 2021: రూ.65,000 వరకు వేతనంతో లోక్‌సభలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Lok Sabha Recruitment 2021: రూ.65,000 వరకు వేతనంతో లోక్‌సభలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Lok Sabha Recruitment 2021: రూ.65,000 వరకు వేతనంతో లోక్‌సభలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Lok Sabha Recruitment 2021 | లోక్‌సభ సచివాలయం ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

కాంట్రాక్ట్ పద్ధతిలో కన్సల్టెంట్ పోస్టుల్ని (Consultant Jobs) భర్తీ చేస్తోంది లోక్‌సభ సచివాలయం. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notifications) ద్వారా మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. వేర్వేరు విభాగాల్లో సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, జూనియర్ కంటెంట్ రైటర్, జూనియర్ అసోసియేట్ సీనియర్ కంటెంట్ రైటర్ లాంటి పోస్టులున్నాయి. లోక్‌సభ సచివాలయంలోని పీపీఆర్ వింగ్‌లో సోషల్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ యూనిట్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇవి ఒక ఏడాది కాంట్రాక్ట్‌తో భర్తీ చేస్తున్న పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ గడువు రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కనొసాగుతోంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 11 చివరి తేదీ. అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే దరఖాస్తుల్ని పోస్టులో పంపాల్సి ఉంటుంది.

Lok Sabha Secretariat Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు11విద్యార్హతలువేతనం
సోషల్ మీడియా మార్కెటింగ్ (జూనియర్ కన్సల్టెంట్)1ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.రూ.65,000
సోషల్ మీడియా మార్కెటింగ్ (సీనియర్ కన్సల్టెంట్)1బిజినెస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. ఏడాది అనుభవం తప్పనిసరి.రూ.35,000
సీనియర్ కంటెంట్ రైటర్ లేదా మీడియా అనలిస్ట్ (హిందీ)1పొలిటికల్ సైన్స్, జర్నలిజం, లా, హిందీలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.రూ.45,000
జూనియర్ కంటెంట్ రైటర్ (హిందీ)1బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. ఏడాది అనుభవం తప్పనిసరి.రూ.35,000
జూనియర్ కంటెంట్ రైటర్ (ఇంగ్లీష్)1బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. ఏడాది అనుభవం తప్పనిసరి.రూ.35,000
సోషల్ మీడియా మార్కెటింగ్ (అసోసియేట్)5బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి.రూ.30,000
మేనేజర్ (ఈవెంట్స్)1హోటల్ మేనేజ్‌మెంట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా పాస్ కావాలి. లేదా మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా డిగ్రీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.రూ.50,000


RBI Scholarship: ఆర్‌బీఐ నుంచి నెలకు రూ.40,000 స్కాలర్‌షిప్... అప్లై చేయండి ఇలా

Lok Sabha Secretariat Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 11

కాంట్రాక్ట్ గడువు- ఒక ఏడాది. పనితీరును బట్టి రెండేళ్ల వరకు కాంట్రాక్ట్ గడువు పొడిగించే అవకాశం ఉంది.

అభ్యర్థుల వయస్సు- 22 నుంచి 58 ఏళ్లు

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ONGC Recruitment 2021: ఓఎన్‌జీసీలో 313 ఉద్యోగాలు... రూ.1,80,000 వరకు వేతనం

Lok Sabha Secretariat Recruitment 2021: అప్లై చేయండి ఇలా...


Step 1- అభ్యర్థులు http://loksabhaph.nic.in/Recruitment/advandnot.aspx వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో Engagement of Consultants in Lok Sabha Secretariat లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 3- నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది.

Step 4- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.

Step 5- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

Administration Branch-I,

Room No. 619, Lok Sabha Secretariat,

Parliament House Annexe, New Delhi – 110001.

First published:

Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Lok sabha

ఉత్తమ కథలు