Lok Sabha Jobs: లోక్‌సభలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Lok Sabha Jobs: లోక్‌సభలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Lok Sabha Recruitment 2020 | లోక్‌సభలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    నిరుద్యోగులకు శుభవార్త. భారత పార్లమెంట్‌లో ఉద్యోగాలు ఉన్నాయి. ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి లోక్‌సభ సచివాలయం రిక్రూట్‌మెంట్ బ్రాంచ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 47 ఖాళీలున్నాయి. లోక్‌సభ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్‌తో పాటు ఇతర డాక్యుమెంట్స్ స్కాన్ చేసి Iss@sansad.nic.in మెయిల్ ఐడీకి పంపాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://loksabha.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    Lok Sabha Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


    మొత్తం ట్రాన్స్‌లేటర్ పోస్టులు- 47
    విద్యార్హత- హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండాలి. లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉంటే డిగ్రీ స్థాయిలో హిందీ సబ్జెక్ట్ చదివి ఉండాలి. వీటితో పాటు హిందీ నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి హిందీకి డిప్లొమా / సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ట్రాన్స్‌లేషన్ సర్టిఫికెట్ ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల్లో 2 ఏళ్లు ట్రాన్స్‌లేషన్ వర్క్స్ చేసి ఉండాలి.
    వయస్సు- 29 ఏళ్లు.
    ఎంపిక విధానం- రాతపరీక్ష
    నోటిఫికేషన్ కోసం https://loksabha.nic.in/ వెబ్‌సైట్ చూడండి.

     

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 723 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 665 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    Bank Jobs: బ్యాంకు ఉద్యోగం మీ కలా? ఈ నోటిఫికేషన్‌కు సిద్ధం కండి
    First published: